పార్టీలు మారి గెలిచిన వారెందరు..? ఓడిన వారెందరు..?

Who All Won By Changing Parties Who Are The Losers,Who All Won By Changing Parties,Changing Parties Who Are The Losers,Who Are The Losers,Ponguleti Srinivas Reddy, Jupally Krishnarao, Thummala Nageshwar Rao, Sabitha Indra Reddy,Assembly Election Results,Telangana Assembly Elections,Mango News,Mango News Telugu,Ponguleti Srinivas Reddy Latest News,Thummala Nageshwar Rao Latest Updates,Sabitha Indra Reddy Live News
ponguleti srinivas reddy, jupally krishnarao, thummala nageshwar rao, sabitha indra reddy, telangana assembly elections

ఎన్నికలొస్తే చాలు నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతుంటారు. టికెట్ దక్కలేదని కొందరు.. అసంతృప్తితో కొందరు.. ఇతర కారణాలతో మరికొందరు పార్టీలు మారుతుంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా పెద్ద ఎత్తున నాయకులు పార్టీలు మారారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌‌లోకి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలలోకి పెద్ద ఎత్తున నాయకులు వెళ్లారు. అయితే ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా రావడంతో.. ఇలా పార్టీలు మారిన నాయకులు ఎంత మంది గెలుపొందారు?.. ఎంత మంది ఓడిపోయారు?.. అనేది ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే గులాబీ బాస్ సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వారిద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ తరుపున పాలేరు నుంచి పొంగులేటి.. కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు పోటీ చేసి ఘన విజయం సాధించారు. అటు చివరి నిమిషంలో బీఆర్ఎస్ టికెట్ దక్కలేదని తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ టికెట్‌పై ఖమ్మం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌పై తుమ్మల గెలుపొందారు.

అటు బీఆర్ఎస్ పార్టీ తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోవడంతో.. మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు టికెట్లు దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున మైనంపల్లి హన్మంతరావు మల్కాజ్‌గిరి నుంచి.. ఆయన కొడుకు హైనంపల్లి రోహిత్ మెదక్ నుంచి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో మెదక్ నుంచి రోహిత్ గెలుపొందినప్పటికీ.. బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి చేతిలో.. హన్మంతరావు  ఓటమిపాలయ్యారు.

అంతేకాకుండా చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ టికెట్ దక్కించుకున్న.. కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి, కూరుకళ్ల రాజేశ్ రెడ్డి నాగర్ కర్నూల్ నుంచి, మేఘారెడ్డి వనపర్తి నుంచి, చెన్నూరు నుంచి గడ్డం వివేక్, మహబూబ్‌నగర్ నుంచి యొన్నం శ్రీనివాసరెడ్డి, మునుగోడు నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరకాల నుంచి రేవూరి ప్రకార్ రెడ్డి, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య, నకిరకేల్ నుంచి వేముల వీరేశం, పినపాక నుంచి సాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు.

అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్న కొందరు నేతలు ఓటమి పాలు కూడా అయ్యారు. కాంగ్రెస్ తరుపున కరీంనగర్ నుంచి పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్, శేరిలింగంపల్లి నుంచి పోటీ చేసిన జగదీశ్వర్ గౌడ్, జహీరాబాద్ నుంచి పోటీ చేసిన చంద్రశేఖర్, ఆసిఫాబాద్ నుంచి పోటీ చేసిన శ్రామ్ నాయక్, సిర్పూర్ నుంచి పోటీ చేసిన రావి శ్రీనివాస్, హుజురాబాద్ నుంచి పోటీ చేసిన విడతల ప్రణవ్ ఓడిపోయారు.

ఇకపోతే 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు గూలాబీ గూటికి చేరారు. అలాగే టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారంతా ఈసారి బీఆర్ఎస్ తరుపున పోటీ చేశారు. కానీ వారిలో కేవలం ఇద్దరే విజయకేతనం ఎగురవేశారు. మిగిలిన వారంతా ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరిన సబితా ఇంద్రారెడ్డి.. ఈసారి ఆపార్టీ తరుపున మహేశ్వరం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాగే ఎల్‌బీనగర్ నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన సుధీర్ రెడ్డి విజయం సాధించారు.

2018 ఎన్నికల్లో తాండూరు నుంచి పైలెట్ రోహిత్ రెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకట రమణా రెడ్డి, జూజుల సురేందర్ ఎల్లా రెడ్డి నుంచి, పినపాక నుంచి రేగా కాంతారావు అశ్వారావుపేట నుంచి మొచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసారి అదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి వారంతా ఓటమి పాలయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − four =