కరోనాతో మరణించిన వైద్యులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

25 lakh ex-gratia for medicos dying of COVID, 25 Lakh Ex-Gratia to Doctors Who Died Due To Covid-19, Coronavirus, Ex-Gratia to Doctors In Telangana, Ex-Gratia to Doctors Who Died, telangana, Telangana covid 19 News, Telangana Govt Announces Rs 25 Lakh Ex-Gratia to Doctors, TS announces Rs. 25 lakh ex-gratia

బీఆర్కే భవనంలో వివిధ డాక్టర్స్ సంఘాలతో సెప్టెంబర్ 1, మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఇటీవల డాక్టర్స్ సంఘాలు చేసిన పలు విజ్ఞప్తులపై సీఎం కేసీఆర్ తో చర్చించిన వివరాలను డాక్టర్స్ సంఘాలుకు ఈ సందర్భంగా మంత్రి ఈటల  వివరించారు. కరోనా సోకిన డాక్టర్స్ కి, ఇతర వైద్య సిబ్బందికి నిమ్స్ ఆసుపత్రి లో పూర్తి స్థాయిలో చికిత్స అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరణించిన డాక్టర్, వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అందించే 50 లక్షలతో పాటుగా, 25 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించారు.

అయితే డాక్టర్స్ సంఘాలు మాత్రం డాక్టర్స్ కి సీఎం సహయనిధి నుండి మరికొంత సాయం అందించాలని మంత్రిని కోరారు. అదేవిధంగా కోవిడ్ వలన అనారోగ్యం బారిన పడిన డాక్టర్స్, సిబ్బందిని ఆన్ డ్యూటీ గా పరిగణించాలని నిర్ణయం తీసున్నామని మంత్రి పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో ముందుండి సేవలందిస్తున్న డాక్టర్స్, పారామెడికల్, ఇతర సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి సంబంధించిన ఇతర సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 13 =