ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు

Chandrababu Naidu For Delhi Complaint To EC On Deletion Of Votes,Chandrababu Naidu For Delhi Complaint,Complaint To EC On Deletion Of Votes,EC On Deletion Of Votes,Chandrababu Naidu, AP Assembly Elections, AP Politics, AP Voters,Mango News,Mango News Telugu,Tdp President N Chandrababu Naidu,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News And Live Updates,Chandrababu Naidu Latest News,Chandrababu Naidu Live Updates
chandrababu naidu, ap assembly elections, ap politics, ap voters

తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఏపీలో మొదలు కానుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే అక్కడ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. నేతలు ఎన్నికలపై ఫోకస్ చేసి పావులు కదుపుతున్నారు. ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా అధికారపీఠాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి ఎన్నికల యుద్ధం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే ఏపీలో కొందరి ఓట్లను తొలగించడం సంచలనంగా మారింది. తమ సానుభూతి పరుల ఓట్లనే తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఓసారి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ తమకు సానుకూల పరిణామాలు రాకపోవడంతో.. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈనెల 7న చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు.

ఇక చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక జిల్లాల వారీగా పర్యటించనున్నారు. ఆత్మగౌరవ నినాదంతో జిల్లాల వారీగా పర్యటనలు చేయనున్నారు. నిజానికి ఈరోజు నుంచే చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. కానీ తుఫాను కారణంగా ఆయన పర్యటను వాయిదా వేశారు. తిరిగి ఈనెల 11 నుంచి చంద్రబాబు నాయుడు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 11న శ్రీకాకుళం, 12న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఎన్నికల సమర శంఖాన్ని పూరించనున్నారు.

అటు చిమౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతల ప్రజలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలుగు అండగా నిలబడి ఆదుకోవాలని ఆదేశించారు.

అటు తిరిగి యువగళం పాదయాత్రను ప్రారంభించిన నారాలోకేష్ తుఫాన్ కారణంగా బ్రేక్ ఇచ్చారు. మూడు రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పాదయాత్రను నిలిపివేశారు. తిరిగి ఈనెల 7న పిఠాపురం నుంచే లోకేష్ పాదయాత్రను ప్రారంభిచనున్నారు. అలాగే తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయక, సహకారాలు అందించాలని లోకేష్ కార్యకర్తలకు ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − seven =