తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జూన్ 5కు వాయిదా

Telangana High Court Postponed The Hearing of MP Avinash Reddy Anticipatory Bail Petition up to June 5,Telangana High Court Postponed The Hearing of MP Avinash Reddy,Avinash Reddy Anticipatory Bail Petition up to June 5,Postponed The Hearing of MP Avinash Reddy,Mango News,Mango News Telugu,YS Avinash Reddy Bail Plea Hearing,CBI Now Free To Arrest Avinash Reddy,Telangana High Court adjourned hearing,Telangana High Court Grants Interim Relief,Viveka murder case,Viveka murder case Latest News,Viveka murder case Latest Updates

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. అయితే ఈ సందర్భంగా వాదనలు విని ఈరోజే ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా దీనిపై విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేంద్ర వెల్లడించారు. రేపటినుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనికి అవినాష్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఈలోపు సీబీఐ ఎంపీని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుపడంతో.. జడ్జి వెకేషన్ బెంచ్ మార్చుకుంటారా? అని అడిగారు. దీనికి బదులుగా అవినాష్ తరపు న్యాయవాది వేసవి సెలవుల ప్రత్యేక కోర్టులో విచారించాలని కోరారు.

ఆయన విజ్ఞప్తికి ప్రధాన న్యాయమూర్తి, ఒకవేళ అంతగా అత్యవసరం అయితే ఎదుట మెన్షన్ చేసి ఎమర్జెన్సీ అని చెప్పండి, ఆయనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అలాగే సీబీఐ అరెస్ట్ చేయకుండా కనీసం రెండు వారాలైనా సమయం ఇవ్వాలని కోరగా.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, అటువంటి ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. కాగా మరోవైపు తెలంగాణ హైకోర్టుకు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించారు. మే 1వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించారు. అయితే అత్య‌వ‌స‌ర కేసుల విచార‌ణ‌ కోసం ప్ర‌తీ గురువారం ప్ర‌త్యేక కోర్టు నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్రమంలో మే 4, 11, 18, 25 తేదీలలో మరియు జూన్ 1న ప్ర‌త్యేక కోర్టు నిర్వ‌హించ‌నున్న‌ట్లు హైకోర్టు రిజిస్ట్రార్ ప్ర‌క‌టించారు. దీనికోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 6 =