చియాంగ్ మై: థాయిలాండ్ వెళ్లే పర్యాటకులు సాధారణంగా బ్యాంకాక్, పట్టాయా చూసి వచ్చేస్తుంటారు. కానీ, చియాంగ్ రాయ్ నుండి చియాంగ్ మై వెళ్లే దారిలో ఒక ‘హిడెన్ గోల్డెన్ టెంపుల్’ ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ట్రావెల్ వ్లాగర్ కార్తిక (KarthiKitess) తన రోడ్ ట్రిప్‌లో అకస్మాత్తుగా కనుగొన్న ఈ ఆలయ విశేషాలు వివరించారు.
కేవలం బంగారం రంగులో మెరిసిపోవడమే కాదు, ఈ టెంపుల్‌లో ఒక రహస్య గంట ఉంది. ఆ గంటను కొట్టి లోపల నిలబడితే కలిగే ఆ వైబ్రేషన్ అనుభూతి వర్ణనాతీతం! అలాగే, ఇక్కడ మరో వింతైన ‘సిల్వర్ టెంపుల్’ కూడా ఉంది, కానీ అక్కడ ఒక ప్రత్యేక నిబంధన అమలులో ఉంది. అసలు ఆ గోల్డెన్ టెంపుల్ ఎక్కడుంది? వెండితో మెరిసే ఆ ఆలయంలో మహిళలకు ఎందుకు అనుమతి లేదు? ఈ ఆసక్తికర విశేషాలన్నీ తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే.










































