సోషల్ మీడియాలో ప్రస్తుతం 80s రెట్రో ట్రెండ్ హల్‌చల్ చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది తమ ఫొటోలను 1980ల నాటి స్టైల్‌లోకి మార్చుకుని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రెండ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చేరారు. 80ల నాటి వింటేజ్ లుక్‌లో ఉన్న తన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ‘Joining 80s trend’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
80ల నాటి వింటేజ్ లుక్‌లో సీఎం
రేవంత్ రెడ్డి షేర్ చేసిన ఫొటోలో 1980ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా రెట్రో దుస్తులు, హెయిర్‌స్టైల్, పాతకాలపు వస్తువులు కనిపిస్తున్నాయి. పాత మోడల్ బైక్, క్యాసెట్ ప్లేయర్, వెనుకభాగంలో 80ల నాటి పోస్టర్లు వంటి అంశాలు ఫొటోకు మరింత వింటేజ్ ఫీల్‌ను తీసుకొచ్చాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 80s AI ట్రెండ్‌లో ఆధునిక ఫొటోలను 1980ల కాలం నాటి దుస్తులు, హెయిర్‌స్టైల్, వాహనాలు, లైటింగ్, ఫిల్మ్ గ్రెయిన్ వంటి అంశాలతో రీ-ఇమాజిన్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది.
‘జాయినింగ్ 80s ట్రెండ్’ అంటూ రేవంత్ పోస్ట్
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తన రెట్రో లుక్‌ను నెటిజన్లతో పంచుకున్నారు. ‘Joining 80s trend’ అంటూ ఆయన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయ అంశాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం.. ఇలా సరదాగా ట్రెండింగ్‌లో భాగం కావడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం 80s ట్రెండ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. నాస్టాల్జియా, AI టెక్నాలజీ కలయికతో వచ్చిన ఈ ట్రెండ్ మరికొంతకాలం నెట్టింట కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
Joining 80’s trend… pic.twitter.com/LpfG6CxpGA
— Revanth Reddy (@revanth_anumula) September 10, 2026
సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్
80ల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఫొటోలను మార్చుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్త క్రేజ్‌గా మారింది. ముఖ్యంగా AI టెక్నాలజీతో సాధారణ ఫొటోలను వింటేజ్ ఫ్యామిలీ ఆల్బమ్ లేదా అప్పటి సినిమా పోస్టర్ తరహా లుక్‌లోకి మార్చుకుంటున్నారు.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఈ ట్రెండ్‌లో భాగమయ్యారు. రాజకీయ నాయకులు 80ల నాటి వాహనాలు, దుస్తులు, నేపథ్యాలతో రూపొందించిన AI ఫొటోలను షేర్ చేయడంతో ఈ ట్రెండ్ మరింత వైరల్‌గా మారింది.









































