ఏపీ స్థానిక పోరు: జనసేన తొలి జాబితా విడుదల.. బెజవాడ బరిలో వంగవీటి రాధా

Jana Sena Releases First List of Candidates For AP Municipal Elections

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తన ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసింది. అధికార కూటమిలో భాగంగా పార్టీ పోటీ చేయనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వివరాలను ప్రకటించింది. మొత్తం నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులకు, 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. దీనిలో భాగంగా విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును అధిష్టానం ప్రకటించింది.

ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జాబితా విడుదలైంది. జనసేనకు కేటాయించిన కార్పొరేషన్లలో శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ ఉన్నాయి. ఈ నగరాల్లో మేయర్ పదవుల కోసం పార్టీ అభ్యర్థులను బరిలోకి దించనుంది. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పట్టణ స్థానిక సంస్థల్లో పార్టీకి కేటాయించిన స్థానాలపై స్పష్టత రావడంతో స్థానిక నాయకులు ఎన్నికల కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు.

రాజాం, పాలకొండ, సాలూరు, తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, ముమ్మిడివరం, అమలాపురం, నిడదవోలు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తిరువూరు, పెడన, తెనాలి, చిలకలూరిపేట, దర్శి, మడకశిర, పుట్టపర్తి, పుత్తూరు పట్టణాల్లో జనసేన పోటీ చేయనుంది. ఈ స్థానాల్లో చైర్మన్ పదవులతో పాటు ఆయా వార్డులు, డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక, ప్రచార ఏర్పాట్లు కీలకంగా మారనున్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థులు

  • విజయవాడ మేయర్ అభ్యర్థి: వంగవీటి రాధాకృష్ణ

  • ఏలూరు మేయర్ అభ్యర్థి: రెడ్డి అప్పలనాయుడు

మున్సిపల్ ఛైర్మన్ / నగర పంచాయతీ అభ్యర్థులు

  • అమలాపురం: నల్లా శ్రీధర్

  • గొల్లప్రోలు: కడారి తమ్మయ్య నాయుడు

  • నరసాపురం: కొత్తపల్లి శైలజ

  • పిఠాపురం: బీరా విజయ్‌శేఖర్

  • సాలూరు: గొర్లె విజయకుమారి

  • సామర్లకోట: పిట్టా జానకి రామారావు

  • తిరువూరు: పి. మాధవి

  • నిడదవోలు: కల్లం జ్యోతి

  • పెడన: మట్టా శివపావని

  • తెనాలి: టి. వెంకటరమణారావు

  • చిలకలూరిపేట: తోట రాజేశ్వరి

  • పుత్తూరు: డి. ఏలుమలై
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షిస్తున్నాయి. పోటీ చేసే స్థానాల ప్రకటనతో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగనున్నారు. కూటమి అభ్యర్థుల మధ్య సమన్వయం, వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమస్యలపై ప్రచారం వంటి అంశాలు రానున్న రోజుల్లో ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here