ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 ఉద్యోగాల భర్తీకి ప్రకటన

AP DSC 2026 Notification Out, Online Applications For 2,721 Teacher Posts Begin Nov 11

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. తాజాగా డీఎస్సీ-2026 (AP DSC 2026 / APTRT) నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుండగా, ఇందుకోసం విద్యాశాఖ మూడు వేర్వేరు నోటిఫికేషన్లను ప్రకటించింది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ ప్రకటన ఊరటనివ్వనుంది.

పోస్టుల వివరాలు

  1. సాధారణ పాఠశాలలు (జడ్పీ/మండల పరిషత్/ప్రభుత్వ/మున్సిపల్): 2,111 పోస్టులు (స్కూల్ అసిస్టెంట్లు – 906, ఎస్జీటీ – 1,205)

  2. స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు: 350 పోస్టులు (స్కూల్ అసిస్టెంట్ SE – 150, ఎస్జీటీ SE – 200)

  3. రెసిడెన్షియల్ సొసైటీలు & మోడల్ స్కూళ్లు: 260 పోస్టులు (ప్రిన్సిపల్ – 30, పీజీటీ – 81, టీజీటీ – 113, ఫిజికల్ డైరెక్టర్ – 2, పీఈటీ – 34)

అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tet2dsc.apcfss.in ద్వారా నవంబర్ 11 నుంచి దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 11, 2026

  • దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30, 2026

  • మాక్ టెస్టులు అందుబాటు: డిసెంబర్ 5, 2026

  • హాల్ టికెట్ల విడుదల: డిసెంబర్ 14, 2026

  • కంప్యూటర్ ఆధారిత (CBT) పరీక్షలు: డిసెంబర్ 20, 2026 నుంచి జనవరి 13, 2027 వరకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here