భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. గత కొన్ని రోజులుగా 60 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 23 లక్షలు దాటింది. ఆగస్టు 12, బుధవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 23,29,638 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 60,693 కరోనా పాజిటివ్ కేసులు, 834 కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 46,091 కు చేరింది. దేశంలో మరణాల రేటు 1.98 శాతంగా ఉంది.
గత 24 గంటల్లోనే 56,110 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవడంతో, డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 16,39,599 కు పెరిగింది. దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నపటికి కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 70.38 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో మొత్తం 6,43,948 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉండగా, ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో ఇటలీని దాటి భారత్ 5 వ స్థానానికి చేరింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu