బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ ‌

Bollywood actor Sanjay Dutt, Lilavati hospital, Mumbai, sanjay dutt, Sanjay Dutt Diagnosed With Lung Cancer, Sanjay Dutt Diagnosed With Lung Cancer 4th Stage, Sanjay Dutt diagnosed with stage 4 lung cancer, Sanjay Dutt News

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ అయింది. ఇటీవలే అస్వస్థతకు గురైన ఆయన ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ మూడో స్టేజీకి చేరినట్టు తెలియడంతో మెరుగైన చికిత్స కోసం సంజయ్ దత్ అమెరికా వెళ్లనున్నట్టు సన్నిహితులు వెల్లడించారు. మరోవైపు అభిమాలనుద్దేశించి సంజయ్ దత్ ట్వీట్ కూడా చేశారు.

‘ఒక మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం పని నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. నా కుటుంబం, మిత్రులు నాకు తోడుగా ఉన్నారు. అభిమానులు, శ్రేయోభిలాషులు నా గురించి ఆందోళన చెందవద్దు, మరియు ఊహాగానాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి ప్రేమ, అభిమానంతో త్వరలోనే తిరిగివస్తానని’ సంజయ్ దత్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు సంజయ్ దత్ ‌ కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2, శమ్‌షేరా చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తుండగా, షూటింగ్ పూర్తైన సడక్‌ 2, భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా సినిమాలు త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here