ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 65 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా ద్వారా పలు పరిశ్రమల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, తెలుగు సినీ పెద్దలు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పెద్ద ఎత్తున చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అభిమానులు దేశంలో 100 సినీ ప్రముఖులతో చిరంజీవి పుట్టినరోజు కామన్ డీపీ విడుదల చేయించి సంబరాలు మొదలు పెట్టారు. తమ అభిమాన నటుడి గురించి ట్వీట్లు, స్పెషల్ డిజైన్స్ పోస్టు చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో కొణిదల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో చిరంజీవి నటిస్తున్న 152 వ చిత్రం “ఆచార్య” ఫస్ట్ లుక్ మరియు, మోషన్ పోస్టర్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. కొంత విరామం తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా చిత్రాలు కోట్లాది అభిమానులను ఉర్రుతలూగించడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన కలెక్షన్స్ నమోదు చేశాయి. ఆచార్య సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కరోనా పరిస్థితుల వలన షూటింగ్స్ ఆగిపోవడంతో ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతుంది. అలాగే రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు.మీ అద్భుతమైన నటనా కౌశలంతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆశిస్తున్నాను.ప్రజలకు సేవ చేయడానికి మంచి ఆయురారొగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.మీ కెరీర్లో మరిన్ని గొప్ప మైలురాళ్లు అందుకోవాలని ఆశిస్తున్నాను @KChiruTweets pic.twitter.com/CcB8JDOb1o
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 22, 2020
Wishing you a very Happy Birthday @KChiruTweets garu! You’ve been an inspiration to an entire generation and will continue to be! Great health and happiness to you always sir😊🙏 pic.twitter.com/S7XpdFRWoM
— Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2020
Wishing my dearest friend from the industry @KChiruTweets garu a very Happy Birthday!! #HBDMegastarChiranjeevi pic.twitter.com/I7u5bXkb14
— Venkatesh Daggubati (@VenkyMama) August 22, 2020
చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్. @KChiruTweets pic.twitter.com/TQ4CqAkGgc
— Mohan Babu M (@themohanbabu) August 22, 2020
Many many happy returns to the biggest INSPIRATION of mine and many, @KChiruTweets garu🤗 #HBDMegastarChiranjeevi pic.twitter.com/6Ex0MzlMjS
— Ravi Teja (@RaviTeja_offl) August 22, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu