పురపాలికల్లో ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ నియామకం, దేశంలోనే మెదటిసారి

KTR Review Meeting, Minister KTR, Minister KTR Review Meeting, Minister KTR Review Meeting on Recruitment of Ward Officers, Recruitment of Ward Officers, Recruitment of Ward Officers in Municipalities, Telangana Recruitment of Ward Officers

పట్టణాల్లో ప్రజలకు పౌర సేవలను మరింతగా వేగంగా ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న మున్సిపల్ పోస్టులతో పాటు, కేబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ తో జరిగిన సమావేశంలో ఈమేరకు పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది. పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీ పైన ఆరుసార్లు అంతర్గతంగా సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నారు. పురపాలక శాఖలో 2298 కొత్త ఖాళీలను భర్తీ చేసే ముందు సంబంధిత పోస్టులను, ఉద్యోగులను రెషనలైజ్(హేతుబద్ధీకరణ) చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పురపాలకశాఖ అంతర్గతంగా చర్చలు నిర్వహించి ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.

పరిశుభ్రమైన పట్టణాలు, ప్రణాళిక బద్దమైన పట్టణాలు, ప్రతి పట్టణం హరిత పట్టణం కావాలన్న సీఎం కేసీఆర్ అలోచనల మేరకు రూపొందించిన నూతన పురపాలక చట్టానికి అనుగణంగా ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు మంత్రి కేటిఆర్ తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీ తర్వాత ప్రజలకి వేగంగా పౌర సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రగతి మరింత వేగవంతం అవుతుందన్నారు. దీంతో పురపాలనలో నూతన మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈమేరకు ప్రతి వార్డుకు ఒక పురపాలక ఉద్యోగిని ఉంచే లక్ష్యంలో వార్డు అఫీసర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇలా అన్ని వార్డుల్లో ఒక అధికారి ఉండడం దేశంలోనే మెదటిసారి అని మంత్రి కేటిఆర్ అన్నారు. పురపాలక చట్టం నిర్ధేశించిన పారిశుద్ధ్యం, హారిత హారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పురసేవల అమలు మెదలైన కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఈ వార్డు అఫీసర్ల నియామకం దోహాదం చేస్తుందన్నారు.

ఖాళీల భర్తీ తర్వాత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు, పురపాలక శాఖ నూతన చట్టం ప్రకారం స్ఫూర్తితో ముందుకు పోయేందుకు వీలు కలుగుతుందన్నారు. వార్డు అఫీసర్ల నియామకం ద్వారా ప్రజలకు పురపాలక శాఖకు అవసరమైన వారధి ఏర్పడుతుందని, తద్వారా పురపాలనా అంటే పౌర పాలన అనే స్పూర్తి నిజం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. పురపాలకశాఖ ఇంజనీరింగ్ పనులలో ప్రస్తుతం జరుగుతున్న అసాధారణ జాప్యం అరికట్టేందుకు ఇద్దరు ఛీప్ ఇంజనీర్లను ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటిఆర్ తెలిపారు. ప్రస్తుతం గుర్తించిన ఖాళీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. వీటి భర్తీ అత్యంత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − five =