ప్రస్తుతం పలు దేశాల్లో కోవిడ్-19 (కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారి వలన ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలు మందికి పైగా మరణించారు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం మొత్తం 1,001,644 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. అమెరికాలో అత్యధికంగా 2,05,070 మరణాలు నమోదు కాగా, బ్రెజిల్ లో 142,058, భారత్ లో 96318, మెక్సికో లో 76603, యూకేలో 42090, ఇటలీలో 35851, పెరూలో 32262, ఫ్రాన్స్ లో 31744, స్పెయిన్ లో 31411, ఇరాన్ లో 25779, కొలంబియాలో 25641, రష్యాలో 20299 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటికి 3 కోట్ల 33 లక్షల 53 వేల 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారత్, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu