తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జల వివాదాలపై అక్టోబర్ 6 న అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ?

Andhra Pradesh Government, AP And TS Over Water Project Dispute, AP And TS Water Project Dispute, AP NEWS, Apex Council Meeting, Apex Council Meeting Between AP And TS, Apex Council Meeting Between AP And TS Over Water Project Dispute, Telangana, Telangana Government, Water Project Dispute, Water Project Dispute News, Water Project Dispute Updates

గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకున్న వివాదాలపై అక్టోబర్ 6 అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో జరిగే ఈ అపెక్స్ కౌన్సిల్‌ సమావేశంకు సంబంధించి తెలుగు రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి యూపీ సింగ్ సోమవారం నాడు లేఖ రాశారు. తెలంగాణ సీఎం కె.చంద్ర శేఖర్ రావు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందుబాటులో ఉంటే అక్టోబర్ 6 వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

ముందుగా ఆగస్టు 25న జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వాయిదా వేశారు. కాగా గత ఆరేళ్లలో రెండురాష్ట్రాల జల వివాదాలకు సంబంధించి ఒకే ఒక్కసారి అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ జరిగింది. 2016 లో జరిగిన ఆ భేటీకి అప్పటి సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబు, మరియు అప్పటి కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =