తెలంగాణ ఎంసెట్-2020 (అగ్రికల్చర్ అండ్ మెడికల్) ఫలితాలు విడుదల

2020 Agriculture and Medical Stream Results, 2020 Agriculture and Medical Stream Results Released, EAMCET, EAMCET News, Medical Stream Results Released, Telangana EAMCET 2020, Telangana Eamcet 2020 Agriculture, TS Eamcet 2020, TS EAMCET 2020 agriculture, ts eamcet agriculture results 2020, TS EAMCET Results 2020

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్‌ 28, 29వ తేదీల్లో ఎంసెట్-2020 (అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్) ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను శనివారం నాడు కూక‌ట్‌ప‌ల్లి జేఎన్టీయూ క్యాంప‌స్‌లో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుద‌ల చేశారు. రాష్ట్రంలో కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ సంవత్సరం ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాలకు విడివిడిగా పరీక్ష నిర్వహించారు. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షకు 63,857 మంది విద్యార్థులు హాజరుకాగా, 59,113 మంది ఉత్తీర్ణత సాధించినట్టుగా తెలిపారు. మొత్తం 92.57 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించగా తొలి మూడు ర్యాంకులు అమ్మాయిలు కైవ‌సం చేసుకున్నారు. ఇక పరీక్షకు హాజరైన విద్యార్థులంతా అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. మరోవైపు కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేష‌న్ ను నవంబర్ లో విడుద‌ల చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu