శశికళకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ, ఆసుపత్రిలో చికిత్స

AIADMK leader Sasikala, Expelled AIADMK leader Sasikala, Expelled AIADMK Leader Sasikala Tests Positive for Covid-19, Mango News, Sasikala, Sasikala Admitted to the Hospital, Sasikala health news, Sasikala News, Sasikala tests positive, Sasikala tests positive for Covid, Sasikala Tests Positive for Covid-19, VK Sasikala tests positive for Covid-19

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా వైరస్‌ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందుగా బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళకు జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో బౌరింగ్‌ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించగా ర్యాపిడ్ యాంటిజెన్‌ టెస్టులో నెగటివ్ వచ్చినప్పటికీ, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ప్రస్తుతం శశికళ బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ లోని స్పెషల్ కోవిడ్-19 సెంటర్‌లో చికిత్స పొందుతుంది. టైప్ 2 డయాబెటిస్, హైపర్‌టెన్షన్ తో పాటుగా తీవ్రమైన కోవిడ్ న్యూమోనియాతో ఆమె బాధపడుతున్నట్టు విక్టోరియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆమెకు కోవిడ్ ప్రోటోకాల్‌ ప్రకారం చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ జనవరి 27వ తేదీన విడుదల కావాల్సిఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ