తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2022 మే/జూన్ నెలల్లో నిర్వహించబడతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలకు హాజరు కావాలనుకునే పదో తరగతి, ఇంటర్మీడియట్ అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించే తేదీలను వెల్లడించారు. అభ్యర్థులు టీఎస్ ఆన్లైన్ లేదా మీ-సేవా కేంద్రాలలో మాత్రమే ఆన్లైన్ ద్వారా పరీక్ష ఫీజును చెల్లించాలని, చలాన్ లేదా డిడి ద్వారా చెల్లింపు అంగీకరించబడదని పేర్కొన్నారు. ఈ మేరకు టాస్ డైరెక్టర్ ఎం.సోమిరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పరీక్ష ఫీజు చెల్లింపు కోసం షెడ్యూల్:
- ఫైన్ లేదా ఆలస్య రుసుము లేకుండా : ఏప్రిల్ 8, 2022 నుండి ఏప్రిల్ 18, 2022 వరకు
- ఒక్కో పేపర్‌కు రూ.25/- ఫైన్ తో : ఏప్రిల్ 19, 2022 నుండి ఏప్రిల్ 25, 2022 వరకు
- ఒక్కో పేపర్‌కు రూ.50/- ఫైన్ తో : ఏప్రిల్ 26, 2022 నుండి ఏప్రిల్ 30, 2022 వరకు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ