గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు మరో రెండు పరీక్షలను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ

TSPSC Decided to Cancel Group-1 Prelims and AEE DAO Examinations,TSPSC Decided to Cancel Group-1,Group-1 Prelims Decided to Cancel,TSPSC Cancel AEE DAO Examinations,Mango News,Mango News Telugu,TSPSC Paper Leak,TSPSC Cancels Group -1 Preliminary Exam,TSPSC Cancels Three Recruitment Exams,TSPSC Group 1 Prelims Cancelled,TSPSC Latest News,TSPSC Group 1 Latest Updates,TSPSC Live Updates,Telangana TSPSC Live News,TSPSC Examinations Latest Updates,TSPSC Question Paper Leak Case,TSPSC Paper Leak Scam,TSPSC Question Papers Leakage Issue

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ల లీకేజి వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పలు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. అలాగే ఏఈఈ మరియు డిఏఓ పరీక్షలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి జూన్ 11వ తేదీన నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ మార్చి 17, శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.

“ఈ రోజు ఉదయం 11:30 గంటలకు కమిషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది మరియు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికను మరియు కమిషన్ నిర్వహించిన అంతర్గత విచారణను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ మరియు డిఏఓ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను 2023, 11 జూన్, 2023న మళ్లీ నిర్వహించాలని నిర్ణయించాం. ఇతర పరీక్షల పునఃనిర్వహణ తేదీలు కూడా త్వరలో తెలియజేయబడతాయి” అని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన పరీక్షలు ఇవే:

  • గ్రూప్-1 ప్రిలిమ్స్ (నోటిఫికేషన్ నెం.4/2022) – పరీక్ష నిర్వహించిన తేదీ 2022, అక్టోబర్ 16
  • ఏఈఈ పరీక్ష (నోటిఫికేషన్ నెం.12/2022) – పరీక్ష నిర్వహించిన తేదీ 2023, జనవరి 22
  • డిఏఓ పరీక్ష (నోటిఫికేషన్ నెం.8/2022) – పరీక్ష నిర్వహించిన తేదీ 2023, ఫిబ్రవరి 26.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here