శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు పదకొండో పాఠంలో సహాయ పాత్రలు, ఉప పాత్రలు, గౌరవ అతిథి పాత్రల ప్రాముఖ్యతతో పాటుగా పాసింగ్ పాత్రల గురించి వివరించారు. హీరో లేదా హీరోయిన్ తమ యొక్క ఆశయాన్ని సాధించే క్రమంలో సహాయ, ఉప, గౌరవ అతిథి పాత్రలు ఎలా ఉపయోగపడతాయో పలు సినిమాల్లోని పాత్రలను ఉదాహారిస్తూ విశ్లేషించారు. సాధారణంగా సినిమాల్లో పాత్రల యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉండాలి, సరైన పాత్రల రూపకల్పన సినిమా విజయానికి ఏ విధంగా దోహదపడుతుందో తెలియజేశారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]