గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2023 నోటిఫికేషన్ జూలై 29న విడుదలైన విషయం తెలిసిందే. గేట్-2023 అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష కాగా, దీనిని ఈ ఏడాది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్/కామర్స్/ఆర్ట్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ మరియు డైరెక్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్స్ లో మరియు కేంద్ర విద్యాశాఖ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు మద్దతు ఇచ్చే సంస్థలలో ఆర్ట్స్ మరియు సైన్స్ సంబంధిత శాఖలలో డాక్టరల్ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలు/ఆర్థిక సహాయం కోసం గేట్ పరీక్షను నిర్వహిస్తారు. గేట్ స్కోర్‌ను కొన్ని కాలేజీలు, సంస్థలు కేంద్ర విద్యాశాఖ స్కాలర్షిప్/అసిస్టెంట్‌షిప్ లేకుండా విద్యార్థులకు ప్రవేశం కల్పించడానికి కూడా ఉపయోగిస్తాయి. అలాగే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) తమ రిక్రూట్మెంట్ ప్రక్రియలో గేట్ స్కోర్‌ను ఉపయోగిస్తున్నాయి.
ఇక గేట్-2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 30, మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. గేట్-2023 కు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 ఆఖరి తేదీ అని ప్రకటించారు. గేట్ ఎగ్జామ్ 2023, ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో జరగనుండగా, ఫలితాలను మార్చి 16, 2023 న విడుదల చేయనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
గేట్-2023 ముఖ్య తేదీలు:
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (https://gate.iitk.ac.in): ఆగస్టు 30, 2022
- రెగ్యులర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్/దరఖాస్తు ప్రక్రియ ముగింపు: సెప్టెంబర్ 30, 2022
- పొడిగించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్/దరఖాస్తు ప్రక్రియ ముగింపు: అక్టోబర్ 7, 2022
- గేట్-2023 దరఖాస్తులో మార్పులు: నవంబర్ 4 నుండి నవంబర్ 11, 2022 వరకు
- గేట్ అడ్మిట్ కార్డ్‌లు డౌన్లోడ్ ప్రారంభం: జనవరి 03, 2023
- గేట్-2023 పరీక్షలు నిర్వహణ: ఫిబ్రవరి 04, 05 మరియు ఫిబ్రవరి 11, 12 2023
- దరఖాస్తు పోర్టల్‌లో అభ్యర్థి ప్రతిస్పందన అందుబాటు: ఫిబ్రవరి 15, 2023
- అప్లికేషన్ పోర్టల్‌లో ఆన్సర్ కీలు అందుబాటు: ఫిబ్రవరి 21, 2023
- ఆన్సర్ కీలలో అభ్యర్థులచే ఛాలెంజెస్ సమర్పణ: ఫిబ్రవరి 22, 2023 నుండి ఫిబ్రవరి 25, 2023
- గేట్-2023 ఫలితాల ప్రకటన: మార్చి 16, 2023
- స్కోర్ కార్డ్స్ డౌన్లోడ్ ప్రారంభం: మార్చి 21, 2023.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY