తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు.. పాదయాత్రను నిలిపేయాలని నోటీసులు జారీ

Telangana Police Issues Notice For State BJP Chief Bandi Sanjay To Stop Praja Sangrama Yatra, Telangana Police Issues Notice To Stop Praja Sangrama Yatra, State BJP Chief Bandi Sanjay To Stop Praja Sangrama Yatra, Praja Sangrama Yatra, Telangana State BJP Chief Bandi Sanjay, Bandi Sanjay Kumar Detained By Police, Bandi Sanjay Kumar Arrested, Bandi Sanjay Kumar, BJP Telangana President, Praja Sangrama Yatra News, Praja Sangrama Yatra Latest News And Updates, Praja Sangrama Yatra Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికై గత కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిని నిలిపివేయాలంటూ వర్దన్నపేట ఏసీపీ బండి సంజయ్‌కు నోటీసులు అందజేశారు. జనగామ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పాదయాత్ర పేరుతో విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని, అలాగే ధర్మదీక్ష పేరుతో పలు జిల్లాల నుంచి భారీ జన సమీకరణ చేస్తున్నారని అందులో పోలీసులు తెలిపారు. ఈ చర్యలతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్న పోలీసులు తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ నోటీసును పరిగణలోకి తీసుకోకుండా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here