అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త రూల్స్‌ను ప్రకటించింది. క్రీడాకారుల ప్రవర్తనా నియమావళిలో కొన్ని కీలక మార్పులు సూచిస్తూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బృందం ఇచ్చిన నివేదికను ఐసీసీ ఆమోదించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏ కొత్త రూల్స్ అమలులోకి రానుండగా, ఆస్ట్రేలియాలో వచ్చే నెలల జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఈ కొత్త రూల్స్ పాటిస్తారు. బంతిని ప్రకాశింపజేయడానికి ఆటగాళ్ళు లాలాజలాన్ని ఉపయోగించడం సర్వసాధారణ విషయం. అయితే ఇప్పుడు దీనిపై సంపూర్ణ నిషేధం విధించారు. దీనితో పాటు ఇప్పటివరకు అమలులో ఉన్న పలు కీలక నిబంధనలలో మార్పులు చేర్పులు చేశారు. ఈ మేరకు ఐసీసీ తన అధికారిక సోషల్ మీడియా వేదిక ట్విటర్లో కూడా తెలిపింది.
A host of important changes to the Playing Conditions that come into effect at the start of next month 👀https://t.co/4KPW2mQE2U
— ICC (@ICC) September 20, 2022
ఐసీసీ కొత్త నిబంధనలు..
- కోవిడ్ -19 కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమలు చేయబడిన లాలాజల నిషేధం ఇప్పుడు శాశ్వతంగా ఉంటుంది.
- కొత్త నిబంధనల ప్రకారం మన్కడ్ ఇకపై అన్యాయమైన ఆటగా పరిగణించబడదు, కానీ దానిని ‘రన్-అవుట్’ అని పిలుస్తారు.
- ఒకవేళ బ్యాటర్ క్యాచ్ ఔట్ అయితే, ఇద్దరు బ్యాటర్లు ఒకరికొకరు క్రాస్ చేసినప్పటికీ.. కొత్తగా వచ్చే బ్యాటర్ స్ట్రయికర్ ఎండ్‌లోనే ఆడతాడు.
- ఒక బ్యాటర్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చే కొత్త బ్యాటర్ రెండు నిమిషాల వ్యవధిలో క్రీజులోకి అడుగుపెట్టి బంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో ఇది మూడు నిమిషాలుగా ఉంది.
- వన్డేలు, టెస్టుల్లో ఇది రెండు నిమిషాలుగా మార్చగా, టీ20ల్లో 90 సెకన్ల వ్యవధిను మాత్రం చేంజ్ చేయలేదు.
- ఇక ఈ సమయంలో బ్యాటర్ క్రీజులోకి చేరుకోకుంటే, ఫీల్డింగ్ కెప్టెన్ టైమ్ అవుట్ కోసం అప్పీల్ చేయవచ్చు.
- అలాగే బౌలర్ రన్నప్ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్‌లో ఏదైనా ఉద్దేశపూర్వక కదలికలు చోటుచేసుకుంటే దానిని డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు.
- అంతేకాకుండా బ్యాటింగ్ జట్టుకు పెనాల్టీ రూపంలో 5 పరుగులను అంపైర్ ప్రకటించే అవకాశం కూడా ఉంది.
- ఇక బ్యాటర్ బంతిని ఆడేటప్పుడు పిచ్ పైనే ఉండాలి, ఒకవేళ పిచ్ బయటకు వచ్చి ఆడితే దానిని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు. అలాగే ఇది బౌలర్ కారణంగా జరిగితే అప్పుడు నో బాల్‌గా పరిగణిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY