అదానీ-హిండెన్‌బర్గ్ కేసు.. సుప్రీం సంచలన తీర్పు

Adani Hindenburg Case Supreme Sensational Verdict, Adani Hindenburg Case Supreme, Supreme Sensational Verdict, Adani Hindenburg Case, Adani Case, Adani Group, Gautham Adani, Hiddenburg Report, Supreme Court, Latest Adani Hindenburg Case News, Adani Hindenburg Case Update, Adani Supreme Sensational Verdict, Latest Supreme Court News, Adani Supreme Court News, Mango News, Mango News Telugu
Adani Group, Gautham Adani, Hiddenburg Report, Supreme court

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ గతేడాది అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. అప్పట్లో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగానే కాక.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. హిండెన్ బర్గ్ దెబ్బకు అదానీ గ్రూప్ షేర్లు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టులో కూడా పిటీషన్లు దాఖలయ్యాయి.

అయితే తాజాగా ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అదానీ గ్రూప్‌కు క్లీన్ చీట్ ఇచ్చింది.  అటు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూత్రులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కూడా సెబీ దర్యాప్తును అంగీకరించింది. ఈ వ్యవహారానికి సంబంధించి సెబీ చేస్తున్న దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

సెబీ దర్యాప్తును అనుమానించడానికి జార్జ్ సోరోస్ నేతృత్వంలోని ఓసీసీఆర్పీ నివేదిక ఆధారం కాదని ధర్మాసంన పేర్కొంది. ఈ మేరకు ఈ కేసు విచారణను సెబీ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని ధర్మాసనం వెల్లడించింది. ఇప్పటి వరకు హిండన్ బర్గ్ ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్‌పై దాఖలయిన 24 కేసుల్లో 22 కేసులని సెబీ విచారించింది. మిగిలిన మూడు కేసులను కూడా మూడు నెలల్లో దర్యాప్తు చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. సత్యం గెలిచిందని.. సుప్రీంకోర్టు మరోసారి నిరూపించిందని అన్నారు. తమకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞుడినని పేర్కొన్నారు. భారత దేశ వృద్ధిలో తమ సాహకారం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరక జై హింద్ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. అలాగే సుప్రీంతీర్పుతో అదానీ గ్రూప్‌లోని నమోదిత కంపెనీల షేర్లు నేగు భారీగా పుంజుకున్నాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్ ధర 18 శాతం లాభపడగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ 9 శాతానికి పైగా లాభపడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =