తెలుగుదేశం పార్టీకి (టీడీపీ) చెందిన అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ స్థానంలో ‘టైలర్ హాబ్స్’ అనే పేరు ప్రత్యక్షం అయింది. ఈ నేపథ్యంలో పార్టీ అధికారిక అకౌంట్ హ్యాక్ అయినట్టు గుర్తించామని పార్టీ డిజిటల్ వింగ్ ప్రకటన చేసింది. దీనివెనుక అధికార పార్టీ మద్దతు దుష్టశక్తులు ఉన్నాయని పార్టీ డిజిటల్ వింగ్ ఆరోపించింది. ఇక ఈ అంశంపై ఫిర్యాదు చేశామని, త్వరలోనే ఈ అకౌంట్‌ని రికవరీ చేయడానికి ప్రయత్నిస్తునట్టు తెలిపారు. కాగా గతంలో కూడా ఓసారి టీడీపీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ అయిన విషయం తెలిసిందే. ట్విట్టర్ ఇండియాతో సంప్రదింపుల అనంతరం కొన్ని గంటలకు అకౌంట్ పునరుద్ధరించబడింది.
.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY