ఇంటి అద్దెపై సోషల్ మీడియాలో చర్చ

Discussion On Social Media About The Rent Of Pawan's House, Discussion On Social Medi, Pawan House, Pawan House Rent, Discussion On Pawan House, Pawankalyan 3 Storey Building Rent, 1 Rupee By Farmer, Pithapuram, Pawan kalyan, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
pawankalyan 3 storey building rent 1 rupee by farmer in pithapuram telugu news

గెలుపోటములు, అసెంబ్లీ సీట్లతో సంబంధం లేకుండా పవన్‌ కల్యాణ్‌ స్టార్‌డమ్‌ మాత్రం అలానే ఉంటుంది. ఆయనంటే పడిచచ్చే జనాలు లక్షల్లో ఉంటారు. ఆయన అభిమానులే ఆయన బలం, బలహీనత కూడానూ. ఆయన మీద చూపించే అభిమానం లెక్క కట్టలేనిది. పవన్‌ కోసం పాదయాత్రలు, మౌనవ్రతాలు చేసిన ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు. ఆయన గెలుపు కోసం మోకాళ్లతో గుడి మెట్లు ఎక్కిన అభిమానులూ ఉన్నారు. ఇక రాజకీయంగానూ పవన్‌కు అండగా నిలిచిన ఫ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా పవన్ గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పవన్‌కు ఆయన అభిమాని కేవలం రూపాయ్‌కే మూడంతస్తుల భవనాన్ని అద్దెకు ఇచ్చాడు.

వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అక్కడ ఉండటానికి సొంత స్థలం లేదు. త్వరలోనే పిఠాపురం నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో శాశ్వత నివాసం కోసం స్థలాన్ని ఎంపిక చేస్తానని పవన్ ప్రకటించారు. పురుహూతికా దేవి ఆశీస్సులతో ఇల్లు నిర్మించి ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతానని చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఆయనకు నియోజకవర్గంలో ఉండాలంటే ఇల్లు కావాలి. దీంతో పిఠాపురం పట్టణానికి సమీపంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో బైపాస్ రోడ్డు పక్కన ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.

ఈ మూడంతస్తుల పెద్ద భవనం ఓడూరి నాగేశ్వరరావు అనే రైతుకు చెందినది. ఆయన తన వ్యవసాయ క్షేత్రాల మధ్య దీనిని నిర్మించారు. శుక్రవారం ఆయన గృహప్రవేశం చేశారు. నాగేశ్వరరావు ఈ భవనాన్ని పవన్ కళ్యాణ్ కు అద్దెకు ఇచ్చి తన కార్యాలయాన్ని నడపడానికి, ఉండటానికి ముందుకు వచ్చారు. స్టిల్ట్ ఫ్లోర్ ను పార్కింగ్ స్థలంగా, మొదటి అంతస్తును కార్యాలయంగా ఉపయోగించుకోవచ్చు. డ్యూప్లెక్స్ తరహాలో నిర్మించిన రెండు, మూడో అంతస్తులను పవన్ కల్యాణ్ నివాసంగా ఉపయోగించనున్నారు. మొత్తం భవనానికి అద్దెకు పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటానని నాగేశ్వరరావు ప్రకటించారు. తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానినని, ఆ భవనానికి ఆయన నుంచి ఎలాంటి అద్దె తీసుకోబోనని చెప్పారు. కేవలం రికార్డుల కోసమే ఒక రూపాయి టోకెన్ అమౌంట్ తీసుకుంటాను అని తెలిపాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =