ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం.. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు

AP Police Constable Recruitment 2022 Online Application Deadline Extension Upto Jan 7th,Ap Constable Apply Online 2023,Constable Notification 2023 Ap Last Date,Ap Constable Notification 2023,Apslprb,Mango News,Mango News Telugu,Ap Constable Age Limit 2022,Ap Police Si Notification 2022,Ap Police Constable Selection Process,Ap Constable Syllabus,Ap Constable Apply Online 2022,Constable Notification 2022 Ap Last Date,Ap Constable Notification 2023,Apslprb,Ap Constable Age Limit 2023,Ap Police Si Notification 2022,Ap Govt Constable Notification,Ap Constable Posts,Ap Constable Posts Notification 2023

ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగించింది. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవలే కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయోపరిమితి రెండేళ్లు సడలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును 2023 జనవరి 7 వరకు పొడిగించింది. ఈ మేరకు రిక్రూట్‌మెంట్ బోర్డు పొలీసు నియామక నోటిఫికేషన్ సవరించింది. అంతకుముందు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తు గడువు డిసెంబర్ 28 వరకూ ఉంది. అయితే తాజా సవరణతో అభ్యర్థులకు నేటినుంచి మరో 10రోజుల సమయం లభించినట్లయింది. దీంతో ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయంపై ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం 611 ఎసై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY