పుల్వామా దాడి ఘటనకు నేటితో నాలుగేళ్లు.. ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

PM Modi Pays Tribute To CRPF Jawans Who Lost Lives in Pulwama Attack 4 Years Ago on This Day,Newspaper Report On Pulwama Terror Attack,Terror Attack In Pulwama Today,Recent Terror Attacks In Kashmir,Mango News,Mango News Telugu,2019 Pulwama Terror Attack,List Of Terror Attacks In Kashmir,Biggest Terror Attack In India,Worst Terror Attack In India,2019 Pulwama Attack,Pulwama Attack Date,Pulwama Attack Movie,Pulwama Attack Status Video Download,Pulwama Attack Whatsapp Status,Pulwama Attack In Hindi,Pulwama Attack Revenge,Pulwama Attack Kab Hua Tha,Pulwama Attack Shayari,Pulwama Attack Shradhanjali,14 February Pulwama Attack Status Video,Pulwama Attack Song

జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నేటికి నాలుగేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ ఘటనను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం దీనిపై ఆయన తన ట్విట్టర్ ద్వారా ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. అందులో.. ‘పుల్వామాలో ఈ రోజున మనం కోల్పోయిన మన అమర వీరులను స్మరించుకోవడం మన ధర్మం. వారి అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం. బలమైన మరియు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి వారి ధైర్యం మనల్ని ప్రేరేపిస్తుంది’ అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో వారి త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.

కాగా మసూద్ అజార్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు 2,500 మందికి పైగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది ప్రయాణం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక ఈ ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు దుర్మరణం పాలయ్యారు. 2020వ సంవత్సరంలో పుల్వామా దాడి ఘటనలో ఎన్‌ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో 19 మందిని నిందితులుగా చేర్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ తర్వాత భారత ప్రభుత్వం దీనికి బదులు తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మన్సేరా జిల్లాలో ఉన్న బాలాకోట్ ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన దళం సర్జికల్ స్ట్రైక్‌ చేసింది. ఇక ఈ దాడిలో ఉగ్రవాద శిక్షణ పొందుతున్న వారితో సహా పలువురు కీలక నేతలు మరణించారని భారత ప్రభుత్వం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + nine =