నీట్ పీజీ పరీక్ష-2022 వాయిదా, 6-8 వారాల పాటు వాయిదా వేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం

Health Ministry postpones NEET PG exam, Health Ministry Postpones NEET PG Exam 2022, Health Ministry postpones NEET Postgraduate exam, Mango News, NEET, NEET PG Exam, NEET PG Exam 2022, PG Exam 2022, Postpone NEET PG 2022, Union health ministry, Union Health Ministry Postpones NEET PG Exam, Union Health Ministry Postpones NEET PG Exam 2022, Union Health Ministry Postpones NEET PG Exam 2022 by 6-8 weeks, Union Health Ministry postpones NEET-PG 2022

పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ పరీక్ష-2022 వాయిదా వేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ముందుగా షెడ్యూల్ ప్రకారం మార్చి 12వ తేదీన నీట్ పీజీ పరీక్ష-2022 నిర్వహించాల్సి ఉండగా, తాజాగా 6-8 వారాల పాటుగా వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్ అదే సమయంలో జరుగుతుండడం, అలాగే చాలా మంది ఇంటర్న్‌లు మే/జూన్ 2022 నాటికి పీజీ కౌన్సెలింగ్-2022లో పాల్గొనలేరు కాబట్టి నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. త్వరలోనే పరీక్ష నిర్వహణ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఇంతకుముందే నీట్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ కొందరు ఎంబీబీఎస్ డాక్టర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష వాయిదాపై గురువారం నాడు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 1 =