తెలంగాణలో ఇటీవల నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ), అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) మెయిన్స్ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల అయింది. ఈ మేరకు ప్రిలిమినరీ కీని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్పీఆర్బీ) గురువారం విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీ ని టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్ www.tslprb.inలో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు దీనిని యాక్సెస్ చేయడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చని, డౌన్లోడ్ లింక్ని ఉపయోగించి చెక్ చేసుకోవచ్చని సూచించింది. ఇక దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు బోర్డు దృష్టికి తీసుకురావచ్చని పేర్కొంది. అయితే సంబంధిత ఆధారాలను నిర్ణీత నమూనాలో మాత్రమే అప్లోడ్ చేయాలని, అలాంటి విజ్ఞప్తులనే పరిగణనలోకి తీసుకుంటామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE