‘మా’ తాత్కాలిక అధ్యక్షుడిగా నటుడు బెనర్జీ నియామకం

Actor Banerjee, MAA, maa new president, Maa President, MAA President Banerjee, Mango News Telugu, movie artist association president, Movie Artists Association, New Active President of Movie Artist Association, President of Movie Artist Association
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) తాత్కాలిక అధ్యక్షుడిగా మార్చ్ 4, బుధవారం నాడు ప్రముఖ నటుడు బెనర్జీ నియమితులయ్యారు. ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడైన సీనియర్ నటుడు నరేశ్‌ 41 రోజులపాటు సెలవు పెట్టిన నేపథ్యంలో, ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బెనర్జీని తాత్కాలిక అధ్యక్షుడిగా నియామించినట్టు పేర్కొన్నారు. ముందుగా మార్చ్ 4, బుధవారం సాయంత్రం మా అసోసియేషన్‌ కార్యాలయం పక్కనే ఉన్న ఫిల్మ్‌ఛాంబర్‌ లో డిసిప్లినరీ కమిటీ మరియు ఎక్జిక్యూటివ్ కమిటీ సభ్యులైన చిరంజీవి, కృష్ణంరాజు, మురళీమోహన్‌, జయసుధల తదితరులు ‘మా’ కార్యవర్గంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించిన అనంతరం ‘మా’ నిబంధనల ప్రకారం డిసిప్లినరీ, ఎక్జిక్యూటివ్ కమిటీలు తాత్కాలిక అధ్యక్షుడిగా బెనర్జీని నియమించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో సినీ ప్రముఖులు జీవితా రాజశేఖర్‌, హేమ, అలీ, తనీశ్‌, రాజీవ్‌ కనకాల, అశోక్‌కుమార్‌, రాజా రవీంద్ర, శివ బాలాజీ, అనితా చౌదరి, జయలక్ష్మి, కరాటే కల్యాణి, ఏడిద శ్రీరామ్‌, సురేశ్‌ కొండేటి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here