వైసీపీ గెలుపు కోసం వాలంటీర్ల వాడకం

60 percent votes, volunteers, YCP win,Jagan,YS Jagan, Chandrababu, Pawan Kalyan, YCP, TDP,YSRCP,polling booths,Mangalagiri,andhra pradesh,Mango News Telugu,Mango News
60 percent votes, volunteers, YCP win,Jagan,YS Jagan, Chandrababu, Pawan Kalyan, YCP, TDP,

వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించుకోవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే హెచ్చరించింది. మరోవైపు ప్రతి పక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా డోంట్  కేర్ అంటూ  వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి దించి యధేచ్చగా వారిని ఉపయోగించుకోవడానికి  వైసీపీ గవర్నమెంటు అడుగులు వేస్తుంది.

ఏపీ వ్యాప్తంగా ప్రతీ బూత్‌ పరిధిలోనూ వాలంటీర్ల సాయంతో వైసీపీకి  60శాతం ఓట్లు పడేలా చూడాలని  ఇప్పటికే నాయకులకు వైసీపీ అధిష్టానం టార్గెట్ ఫిక్స్ చేసింది. తాజాగా మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, మండలస్థాయి, సచివాలయ స్థాయి ఇన్చార్జిలకు ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో వాలంటీర్లను ఉపయోగించుకోవడంపైనే ఎక్కువ దృష్టి సారించాలని ఏపీ సీఎం జగన్  అన్నారు.  వాలంటీర్ల ద్వారా ప్రతి బూత్‌లో కనీసం 60 శాతం ఓట్లు అయినా సాధించాలని నేతలకు వైసీపీ అధినేత నిర్దేశించారు.

వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐ-ప్యాక్‌ ప్రతినిధులతో పాటు ఐటీ నిపుణుడు లోకేశ్వరరెడ్డి.. ఈ కార్యక్రమంలో  పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా బూత్‌ స్థాయిలో ఎన్నికల నిర్వహణపై అందరికీ వివరించారు. బూత్‌లవారీగా 2019 ఎన్నికల్లో ఓటింగ్‌ సరళి ఎలా ఉందన్న విషయాల నుంచి. .  అప్పట్లో టీడీపీకి ఎక్కడెక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయనే వివరాలను వైసీపీ శ్రేణులకు వివరించారు.

బూత్‌ స్థాయిలో ఓటరు లిస్టును ఎలా నిర్వహించుకోవాలి? అందులో టీడీపీ,జనసేన ఓటర్లతో పాటు తటస్థ ఓటర్లు, వైసీపీ సానుకూల ఓటర్లు ఎవరనేది స్పష్టంగా ఎలా తెలుసుకోవాలి వంటివాటిపై శిక్షణ ‌ ఇచ్చారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 46 వేల పోలింగ్‌ బూత్‌లు ఉంటే.. ఇప్పటి వరకూ 43 వేలకు పైగా బూత్‌ కోర్‌ కమిటీలను సన్నద్ధం చేసినట్లు వివరించారు. ఈ బూత్ కోర్ కమిటీల్లో ముగ్గురు కోర్‌ సభ్యులు ఉంటారని, వారికి వాలంటీర్లు, గృహసారథులను అటాచ్ చేస్తూ పనిచేస్తారని వివరించారు. దీని ప్రకారం ప్రతి కమిటీలో వాలంటీర్లు తప్పనిసరిగా ఉంటారన్నట్లు తెలుస్తోంది.

ఏపీ వ్యాప్తంగా 80 ఏళ్లకు పైబడిన వృద్ధులతో పాటు వికలాంగులలో 10 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వారంతా ఈసారి పోలింగ్ బూత్‌కు వెళ్లకుండా ఇంటినుంచే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. కాకపోతే ఆ అవకాశాన్ని పొందడానికి  వారంతా సకాలంలో ఈసీకి  దరఖాస్తు చేసుకోవాలి. ఈ పనిని ఇప్పుడు వైసీపీ తమ కోర్ సభ్యులలో ఒకరైన  వాలంటీర్లు చూసుకోవాలి. దీని ప్రకారం బూత్‌ కమిటీలు వీరి ఓట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు..వారి దరఖాస్తుల పని దగ్గరుండి చేయించాలి. తర్వాత వారికి ఓటు వేసే అవకాశం వచ్చేవరకు ఫాలో అప్‌ చేయాలని ప్రజంటేషన్లో వివరించారు.

నేతలతో పాటు కోర్ కమిటీ సభ్యులు, ముఖ్యంగా వాలంటీర్లు గడప గడపకు వెళ్లి వారిని వైసీపీకి ఓటేసే విధంగా ఒప్పించాలి. వైసీపీ సానుకూలపరులతో ఓటేసేవిధంగా మొబిలైజేషన్ బాద్యతలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వైసీపీ ప్రభుత్వం గురించి సానుకూల ప్రచారం చేయాలి. ఇలాంటి  అంశాలతోపాటు.. క్షేత్రస్థాయిలో వైసీపీకి మద్దతుగా సానుకూల ప్రచారాన్ని వాలంటీర్లు ఎలా చేపట్టాలనే విషయాలను కూడా వివరించారు. మొత్తంగా వాలంటీర్లతోనే తన గెలుపును డిసైడ్ చేసేలా పక్కా వ్యూహంతో  ఏపీ సీఎం జగన్  మొండిగా ముందుకు వెళుతున్నారన్న వాదన వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE