కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ప్రభావంపై ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి విశ్లేషణ

Corona OutbreakRemove, Doctor Gurava Reddy, Doctor Gurava Reddy Analysis on Corona, Doctor Gurava Reddy Analysis on Corona Outbreak, Doctor Gurava Reddy Analysis on Lockdown Effect

దేశంలో కరోనా వ్యాప్తి వలన ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం, లాక్‌డౌన్ వలన కలిగిన లాభాలు, వ్యాక్సిన్స్ సహా తదితర అంశాలపై ప్రముఖ వైద్యులు గురువారెడ్డి గారు తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాధి అత్యంత ప్రాణాంతకం కాదని చెప్పారు. హెఛ్1ఎన్1, ఎబోలా 20 నుంచి 30 శాతం మరణాలకు కారణమయ్యాయని, అయితే కరోనాకు సంబంధించి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా 2 నుంచి 3 శాతం మరణాల రేటు ఉంటుందని చెప్పారు.

తేలికగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతోనే కరోనాతో ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. అలాగే కరోనా వ్యాధి ఫేజ్-3 లో శరీర రక్షణ వ్యవస్థ సైటోకైన్ లో మార్పుల వలన వ్యాధికి గురైన యువకులు సైతం 24 గంటల్లోనే చనిపోతున్నారని అన్నారు. ఈ పరిస్థితే ప్రాణాంతకంగా మారుతుందని, అందువలనే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన, భయం నెలకొని ఉన్నాయని చెప్పారు. లాక్‌డౌన్ విధించకపోయి ఉంటే దేశంలో పరిస్థితులు, హైదరాబాద్ లో మళ్ళీ లాక్‌డౌన్ వంటి అంశాలపై కూడా డాక్టర్ గురువా రెడ్డి విశ్లేషణ చేశారు.

లాక్‌డౌన్ విధించకపోయి ఉంటే దేశంలో పరిస్థితులు:

  • 130 కోట్లకు పైగా జనాభా కలిగిన ఈ దేశంలో లాక్‌డౌన్ విధించకపొతే తీవ్ర పరిస్థితులు ఉండేవి.
  • న్యూయార్క్ మరియు ఇటలీ మనకన్నా ఎక్కువ మౌలిక సదుపాయాలు ఉన్నా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
  • దేశంలో లాక్‌డౌన్ వలన 5 లాభాలు కలిగాయి.
  • లాక్‌డౌన్ వలన ప్రజలు కరోనా వ్యాధి గురించి అర్ధం చేసుకుని, సిద్ధమయ్యారు.
  • శానిటైజర్స్, ఫేసుమాస్క్, భౌతిక దూరం గురించి తెలుసుకున్నారు. పేస్ మాస్క్ ధరించడం వలన మనల్ని మనం 70 శాతం రక్షించుకోవచ్చు.
  • కరోనా సోకినా ప్రతి 100 మందిలో 70 మందిని డెక్సామెథసోన్‌ లేదా స్టెరాయిడ్స్ కాపాడుతున్నాయి. 
  • దేశంలో లాక్‌డౌన్ లేకపోయుంటే తీవ్ర ఆందోళనకర పరిస్థితులు, అశాంతి నెలకొనేవి.
  • మన దేశంలో లాక్‌డౌన్ లక్షల మంది ప్రాణాల్ని కాపాడింది.

లాక్‌డౌన్ విజయవంతమైందా?

  • లాక్‌డౌన్ వలన ప్రభుత్వం వైద్య సదుపాయాలతో సిద్దమై, అవగాహనా పెంచడం వలనే ఈ కరోనా మహమ్మారిని ఈ స్థాయిలోనైనా ఎదుర్కోగలుగుతున్నాం.
  • లాక్‌డౌన్ లేకపొతే పరిస్థితి న్యూయార్క్ సిటీలా ఉండేది.
  • లాక్‌డౌన్ వలన ముంబయిలోని ధారావి లాంటి ప్రాంతంలో కూడా విజయవంతంగా కరోనా వ్యాప్తిని నిలువరించగలిగాం.
  • అయినా సాధ్యమైనంత ఎక్కువగా టెస్టులు, కాంట్రాక్టు ట్రేసింగ్ చేయలేకపోయారు.
  • అయితే ఏ మహమ్మారినైనా ట్రీట్మెంట్,టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ తోనే నివారించడం సాధ్యమవుతుంది. లాక్‌డౌన్ సమయంలో ట్రేసింగ్ సరిగా జరగలేదు.
  • మొదటి మూడువారాల లాక్‌డౌన్ బాగా పనిచేసింది. ప్రస్తుతం చేస్తున్న విధంగా లాక్‌డౌన్ చివరి రెండు, మూడువారాల్లో పరీక్షలు, ట్రేసింగ్ చేసిఉంటే పరిస్థితులు ఇంకా మెరుగ్గా ఉండేవి.
  • ఇప్పటికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఇతర దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో మరణాల రేటు తక్కువగానే ఉంది.
  • ప్రభుత్వం కౌన్సెలర్స్ తో 100 పైగా హెల్ప్ లైన్స్ పెట్టి రోజుకి 10000 కాల్స్ చేసి బాధితులకి వ్యాధి విషయంలో అవగాహనా కల్పించాలి.
  • పల్స్ ఆక్సిమిటర్ తో చెక్ చేసుకుని 90 శాతం కంటే తక్కువుంటే ఆసుపత్రిలో చేరేలా సూచనలు ఇవ్వాలి.
  • వచ్చే వ్యాక్సిన్స్, యాంటీ వైరల్ డ్రగ్స్ కరోనా నుంచి కాపాడకపోవచ్చు. చేతుల శుభ్రం చేసుకోవడమనే సోషల్ వ్యాక్సిన్ పై ఎక్కువ శ్రద్ద పెట్టాలి.

హైదరాబాద్ లో 2 వారాలు లాక్‌డౌన్ పెట్టాల్సిన అవసరం ఉంది:

  • ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వం 2 వారాలు లాక్‌డౌన్ పెట్టాల్సిన అవసరం ఉంది.
  • ఈ 15 రోజుల్లో హెల్ప్ లైన్స్ ద్వారా ప్రజలకు పెద్ద స్థాయిలో చికిత్స విధానంపై కౌన్సిలింగ్ ఇవ్వాలి.
  • ప్రజలు బయటకు రాకుండా టీవీలు, ఇతర మాధ్యమాల ద్వారా కరోనా పరిస్థితులను అర్ధం చేసుకునేలా వివరించాలి.
  • నిర్మాణాత్మక పద్ధతిలో లాక్‌డౌన్ నిర్వహించి ప్రజలలోని ఆందోళన తొలగించాలి.
  • 15 రోజుల్లో సరైన ప్రణాళికతో హెల్ప్ లైన్స్, కౌన్సిలింగ్, చికిత్స పద్ధతులపై అవహగానా పెంచాలి.
  • ఆసుపత్రుల్లో వెంటిలేటర్స్ సదుపాయాలపై డాష్ బోర్డులు ఏర్పాటు చేయాలి.
  • చికిత్స కోసం పడకలు, వైద్యానికి అవసరమైన ఇతర మౌలిక సదుపాయాల్ని సాధ్యమైనంతవరకు పెంచుకోవాలి.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =