జన్మ జన్మల బంధం అంటూ ఎన్ఆర్ఐ పై యోగా టీచర్ అత్యాచారం

A Yoga Teacher Rapes An NRI By Calling It A Bond Of Birth, A Yoga Teacher Rapes, Yoga Teacher Rapes An NRI, A Bond Of Birth, NRI Raped, Yoga Teacher, Yoga Teacher Raped NRI Women, Yoga Teacher Rapes US NRI, Karnataka Yoga Teacher Rape, Karnataka, Karnataka Latest Crime News, Karnataka Live updates, National News, Mango News, Mango News Telugu

గ‌త జ‌న్మ‌లో మ‌నిద్దరం ప్రేమికులం..నిన్ను చూసాకే నాకు గ‌త జ‌న్మ గుర్తొచ్చింది అంటూ ఓ NRIపై యోగా టీచ‌ర్ అత్యాచారానికి పాల్ప‌డ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాకి యోగా టీచర్‌ భారత్‌కు వచ్చిన సమయంలో తనపై అత్యాచారం చేశాడని అమెరికాకు చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదు చేసింది. గత జన్మలో మనిద్దరికి సంబంధం ఉందంటూ యోగా గురు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిని చిక్కమగళూరులోని కేవల ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్న 54 ఏళ్ల ప్రదీప్ ఉల్లాల్‌గా పోలీసులు గుర్తించారు. అతని వద్ద ఆన్‌లైన్‌లో యోగా క్లాసులు తీసుకుంటున్న బాధితుడు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉల్లాల్‌ను అరెస్టు చేశారు.

తన కుటుంబం పంజాబ్‌కు చెందినదని, 2000 సంవత్సరం నుంచి తాము అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నామని బాధితురాలు పేర్కొంది. 2021, 2022లలో ప్రదీప్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది. నాతో ఆత్మీయంగా మాట్లాడాతు గత జన్మలో నీతో నాకు సంబంధం ఉందని నమ్మించి ఆధ్యాత్మికత, దైవిక ప్రేమ వంటి మాటలు చెప్పి తనపై ప్రదీప్ ఉల్లాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో తెలిపింది. ఫిబ్రవరి 2, 2022 నుంచి అతను నన్ను ఆరు సార్లు రేప్ చేసాడు. ఈ క్రమంలో తాను గర్భం దాల్చగా. చివరకు గర్భస్రావం అయిందని ఆ మహిళ ఆరోపించింది.

ప్రదీప్ ఉల్లాల్ గతంలో దుబాయ్‌లో పనిచేసి ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డాడు. దుబాయ్‌లో ఉన్న సమయంలోనే అక్కడ యోగా తరగతులను ప్రారంభించాడని చెబుతారు. ఇండియాకు తిరిగి రాగానే 2010లో చిక్కమగళూరు జిల్లాలో మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసి, యోగా తరగతులను ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. ఉల్లాల్ హిమాలయ యాత్రలు, పక్షులను చూడటం తదితర కార్యక్రమాలకు ప్రజలను తీసుకెళ్లేవారని చెప్పారు. అతని కార్యకలాపాలు ప్రధానంగా ఆన్‌లైన్‌లో ఉండగా.చాలా మంది విద్యార్ధులు అతనికి శిష్యులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.