కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా విధించిన లాక్డౌన్ 3.0 గడువు మే 17 వ తేదీతో ముగియడంతో, మళ్ళీ మే 31 వరకు పొడిగిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం లాక్డౌన్ 4.0 కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోమ్ శాఖ విడుదల చేసింది. కొత్తగా కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల మినహా రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి నిచ్చారు. అయితే రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడుపుకునేందుకు, ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం ఉండాలని హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకే అధికారం ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా రెడ్, ఆరెంజ్, కంటైన్మెంట్, బఫర్ జోన్లను ఆయా జిల్లాల అధికారులు నిర్ణయించనున్నారు. మరోవైపు కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలు మినహా, వేటికి అనుమతి ఇవ్వకుండా కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలుచేయాలనీ స్పష్టం చేశారు.
లాక్డౌన్ 4.0 లో అనుమతుల వివరాలు:
- ప్రేక్షకులు లేకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెరిచేందుకు అనుమతి
- హోమ్ డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి
- స్మార్ట్ ఫోన్స్ ఉన్నవాల్లంతా ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి
- స్పెషల్ రైళ్లు: అనుమతి ఉంది
- బస్సు సర్వీసులు : కంటైన్మెంట్ జోన్స్ లో తప్ప అన్నిచోట్లా అనుమతి ఉంది
- జిల్లాల మధ్య బస్సు సేవలు: అనుమతి ఉంది
- జిల్లాల్లో బస్సు సేవలు: అనుమతి ఉంది
- బార్బర్ షాప్స్, సెలూన్స్, స్పాస్: అనుమతి ఉంది
- మద్యం, పాన్ షాప్స్: అనుమతి ఉంది
- మెడికల్ క్లినిక్, ఓపీడీ: అనుమతి ఉంది
- ఆటో మరియు టాక్సీ: డ్రైవర్ సహా ఒకరికి అనుమతి ఉంది
- 4 – వీలర్: డ్రైవర్ సహా ఇద్దరు ప్రయాణికులు
- 2 – వీలర్: డ్రైవర్ సహా ఒకరికి అనుమతి ఉంది. రెడ్ జోన్స్ తో బైక్ పై ఒక్కరికే అనుమతి
- వ్యవసాయ కార్యకలాపాలు: అనుమతి ఉంది
- ప్రైవేట్ అండ్ ప్రభుత్వం ( నాన్ కోర్) సేవలు: అనుమతి ఉంది
- పరిశ్రమలకు అనుమతి: అనుమతి ఉంది
- అర్బన్ ఇండస్ట్రీస్: అనుమతి ఉంది
- అర్బన్ ప్రాంతాల్లో నిర్మాణాలు: అనుమతి ఉంది
- ఈ-కామర్స్ ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ గూడ్స్: అనుమతి ఉంది
- ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగులు: ఆరంజ్, గ్రీన్ జోన్స్ లో 100 శాతం, రెడ్ జోన్ లో 33 శాతం అనుమతి, కంటైన్మెంట్ జోన్స్ లో అనుమతి లేదు
- డొమెస్టిక్ సహాయం: అనుమతి ఉంది
- సరుకు రవాణా: అనుమతి ఉంది
- పోస్టల్ మరియు కొరియర్ సేవలు: అనుమతి ఉంది
- అర్బన్ ప్రాంతాల్లో సింగిల్ నాన్ ఎసెన్షియల్/ ఎసెన్షియల్ షాపులు: అనుమతి ఉంది
- బ్యాంక్స్ మరియు ఫైనాన్స్ సంస్థల సేవలు: అనుమతి ఉంది
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]