ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి- ఏడీజీ అయ్యనార్

ADG Ravi Shankar Ayyanar, ADG Ravi Shankar Ayyanar Responds Over Allegations On Palnadu, ADG Responds Over Allegations On Palnadu, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, Ravi Shankar Ayyanar Responds Over Allegations On Palnadu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఏడీజీ రవిశంకర్‌ అయ్యనార్ స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఒక పార్టీ చేస్తున్న ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని ఆయన ప్రకటించారు. పల్నాడు ప్రాంతంలో పరిస్థితి దిగజారిందని, పోలీసులపై కూడ అదేపనిగా విమర్శలు చేసారని చెప్పారు. ఈ నేపధ్యంలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారన్నారు. ఆ ప్రాంతంలో 8 హత్యలు జరిగినట్లుగా వచ్చిన ఆరోపణలు నిజం కావని ఏడీజీ అయ్యనార్ స్పష్టం చేశారు. అవన్నీ రాజకీయ హత్యలు కాదని, రౌడీ గ్రూపుల దాడులకు సంబంధించినవని చెప్పారు. రాజకీయ గొడవల్లో ఒక్కరే చనిపోయారని పేర్కొన్నారు.

అదేవిధంగా 110 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని వచ్చిన ఆరోపణలలో కూడ వాస్తవం లేదన్నారు. అవి రాజకీయాలకు సంబంధించినవి కావని చెప్పారు. 38 సార్లు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదని ఆరోపణలలో నిజం లేదన్నారు. అయితే ఎన్నికల ముందు నమోదైన 10 కేసుల్లో 70 మంది వైసీపీ వర్గీయులు, 41 మంది టీడీపీకి చెందిన వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని పేర్కొన్నారు. అలాగే ఆత్మకూరు నుంచి 545 మంది గ్రామ విడిచి వెళ్లిపోయారని ఆరోపించారని, కానీ పనులు కోసం కేవలం 345 మంది మాత్రమే బయటకు వెళ్లారని అందులో కూడ 312 మంది వెంటనే వెనక్కి తిరిగి వచ్చారని తెలిపారు. రాజకీయ కారణాలతో ఎవరూ భయానికి గురై గ్రామం విడిచి పోలేదని, ఎవరికైనా అనుమానాలు ఉంటే ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించుకోవచ్చని స్పష్టం చేశారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here