ఏపీ రాజధాని అమరావతి కేసులో సుప్రీం కీలక నిర్ణయం, 28వ తేదీనే విచారిస్తామని స్పష్టం

Amaravati Capital Case Supreme Court Confirms Hearing will be on March 28th in Plea of AP Govt,Amaravati Capital Case,Supreme Court Confirms Hearing Amaravati Capital Case,Amaravati Capital Case Hearing on March 28th,Amaravati Capital in Plea of AP Govt,Mango News,Mango News Telugu,Andhra Pradesh Capital,Andhra Pradesh Capital Issue,Andhra Pradesh Capital 2023,Andhra Pradesh New Capital,Andhra Pradesh Old Capital,Capital Of Andhra Pradesh 2023,Andhra Pradesh 3 Capital Issue

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును 28వ తేదీనే విచారిస్తామని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం, 28వ తేదీ కన్నా ముందే కేసు విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు చేసిన విజ్ణప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఇందులో రాజ్యాంగ పరమైన అంశాలు అనేకం అపరిష్కృతంగా ఉన్నాయని, హడావిడిగా నిర్ణయం తీసుకోవడం కుదరదని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ పేర్కొన్నారు. అయితే ఈ కేసులో విచారణకు 28వ తేదీ ఒక్క రోజే సరిపోదని, బుధ, గురువారాల్లో కూడా విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం బదులిస్తూ.. బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సీజేఐ సర్క్కులర్ ఉందని గుర్తు చేసింది. దీంతో సీజేఐ ధర్మాసనం ముందు దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరగా.. అనుమతి ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 9 =