నెల్లూరులో ఫుల్ జోష్‌‌లో ఉన్న టీడీపీ

TDP,Kotam Reddy Sridhar Reddy, Mekapati Chandrasekhar Reddy, Anam Ramanarayana Reddy, Chandrababu,Nellore,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,assembly elections,andhra pradesh,Mango News Telugu,Mango News
TDP,Kotam Reddy Sridhar Reddy, Mekapati Chandrasekhar Reddy, Anam Ramanarayana Reddy, Chandrababu

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా వెంకటగిరి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆనం రామానారాయణరెడ్డి కొద్ది రోజుల్లో సొంత ప్రభుత్వం చేస్తున్న పనులు నచ్చక జగన్ సర్కార్ పై బహిరంగంగానే విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కేవారు. ఏడాది క్రితం అయితే సొంత పార్టీపైనే తీవ్ర స్థాయిలో బరస్ట్ అయ్యారు. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి క్రాస్ ఓటింగ్‌ చేశారనే ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెన్షన్‌కి గురయ్యారు ఆనం రామనారాయణ రెడ్డి.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి కూడా అప్పుడు టీడీపీకి దగ్గరయ్యారు. అప్పటి నుంచి తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలతో పాటు..లోకేష్ చేస్తున్న కార్యక్రమాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటూ మళ్లీ వెంకటగిరి నుంచే పోటీ చేయడానికి టికెట్ ఆశించారు. నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి లిస్ట్‌లోనే తన పేరును చేరుస్తారని ఆశించారు.

అయితే చంద్రబాబు…కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టికెట్ కన్ఫమ్ చేశారు కానీ.. ఆనం పేరును ప్రకటించలేదు. ఆనం రామనారాయణరెడ్డికి ఏ నియోజకవర్గం కేటాయించాలో తెలియక అప్పుడు ఆనం పేరును పక్కన పెట్టారు. అయితే 2009లో ఆత్మకూరు నుంచి ఆనం ప్రాతినిధ్యం వహించినా కూడా.. ఆ తర్వాత కొన్ని రాజకీయ సమీకరణాల్లో భాగంగా వెంకటగిరికి మారాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు తెలుగు దేశం పార్టీ నుంచి కూడా అదే సీటును ఆశించారు.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఆనం రామనారాయణ రెడ్డి అవసరం ఆత్మకూరులోనే ఎక్కువగా ఉందని భావించారు. రాజకీయ సమీకరణాలతో ఆనం అక్కడికే వెళ్లాలని సూచించారు. ఆత్మకూరుకు వెళ్లడం ఆనంకి ఇష్టం లేకపోతే సర్వేపల్లికి పంపిస్తే ఎలా ఉంటుందనే దానిపై టీడీపీ అధినేత సర్వే కూడా చేయించారు. కానీ చివరకు ఆత్మకూరు అయితేనే ఆనంకి కరెక్ట్ అని చంద్రబాబు భావించారు. అయితే దీనిపై మొదట్లో పెద్ద ఆసక్తిని కనబరచని ఆనం రామనారాయణ రెడ్డి.. ఇప్పుడు మనసు మార్చుకుని ఆత్మకూరు నుంచి పోటీకి రెడీ అయ్యారు.

ఆత్మకూరులో పోటీ చేయడానికి ముందు ఒప్పుకోని ఆనం..తర్వాత బరిలో దిగేందుకు ఒప్పుకోవడానికి ఇంకో బలమైన కారణం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆర్ధికంగా బలమైన నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తుండటంతో.. ఆత్మకూరులో ఆయన అండగా ఉంటారనే భరోసాతోనే పోటీకి సిద్ధమయ్యారట.

సీనియర్ పొలిటీషియన్ ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పుడు పోటీకి ఓకే చెప్పడంతో .. నెల్లూరులో తెలుగు తమ్ముళ్లంతా ఫుల్ జోష్‌లో ఉన్నారట. అటు ఆనం ఆత్మకూరు వెళ్తే.. ఇటు సర్వేపల్లిలో సోమిరెడ్డి పోటీకి లైన్ క్లియర్ అయినట్టే అవుతుంది. ఇక వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ కానీ డాక్టర్ మస్తాన్‌ కానీ ఎవరో ఒకరికి సీటు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =