నేను బ్రతికి ఉండగా పోలవరం నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం లేదు – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

AP Ex MP Undavalli Arun Kumar Sensational Comments on Polavaram Project, Ex MP Undavalli Arun Kumar Sensational Comments on Polavaram Project, MP Undavalli Arun Kumar Sensational Comments on Polavaram Project, Undavalli Arun Kumar Sensational Comments on Polavaram Project, AP Ex MP Undavalli Arun Kumar Comments on Polavaram Project, AP Ex MP Intresting Comments on Polavaram Project, AP Former MP Undavalli Arun Kumar Remarks on Polavaram Project, Sensational Comments on Polavaram Project, Polavaram Project, AP Former MP Undavalli Arun Kumar, AP Ex MP Undavalli Arun Kumar, Undavalli Arun Kumar, AP Former MP, Polavaram Project News, Polavaram Project Latest News, Polavaram Project Latest Updates, Polavaram Project Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బ్రతికి ఉండగా పోలవరం నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణ పనులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగిందని, అయినా ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తి కాలేదని, దీనికి కారకులెవరని ఉండవల్లి ప్రశ్నించారు.

ఇక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను తక్షణమే ఆదుకోవాలని, అది ప్రభుత్వాల కనీస బాధ్యతని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల గోదావరికి వచ్చిన వరదల్లో పోలవరం డయాఫ్రమ్ వాల్‌ దెబ్బతిందని ప్రభుత్వం చెప్పిందని, దీనికి కారణం ఏంటని, ఈ విషయంలో ఎవరిపై చర్యలు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. దేని ఆధారంగా కాఫర్ డ్యామ్ కంటే ముందే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారని, దీనికి బాధ్యులెవరో నిర్థారించాలని, తప్పు ఎవరిదో సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబు చెప్పాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని వ్యాఖ్యానించిన మంత్రి అంబటి రాంబాబును అభినందిస్తున్నానని అన్నారు. మరోవైపు అసలు పోలవరం డ్యామ్ ఇంకా కట్టనే లేదని, కానీ దీని కారణంగానే భద్రాచలం మునిగిపోయిందని తెలంగాణ నాయకులు ఆరోపిస్తున్నారని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 6 =