జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడిన నారా లోకేష్

Andhra Political News, Mango News, Nara Lokesh About YCP Govt Budget 2019, Nara Lokesh comments on Union budget 2019, Nara Lokesh Comments On YCP Govt Budget, Nara Lokesh Latest News, Nara Lokesh satire on CM YS Jagan, TDP MLC Nara Lokesh Question YCP Govt, union Budget 2019 Latest News

రాష్ట్ర బడ్జెట్ చర్చలో భాగంగా, నారాలోకేష్ సోమవారం నాడు శాసన మండలి లో మాట్లాడారు. అప్పుల విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరస్పరం సంబంధం లేని ప్రకటనలు చేస్తున్నారని, ప్రజలు వేటిని నమ్మాలని ప్రశ్నించారు. వైసిపి ప్రవేశ పెట్టింది మాటల బడ్జెట్ యే తప్ప చేతల బడ్జెట్ కాదన్నారు, పాదయాత్ర సందర్భంగా 600 పైగా హామీలు ఇచ్చారని, ఇప్పుడు కేవలం నవరత్నాలు అంటూ మాట మార్చారు అని చెప్పారు. వైసీపీ నుండి 22 మంది ఎంపీలను గెలిపిస్తే, ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్ , ఇప్పుడు ప్రధానికి పాదాభివందనం చేస్తున్నారు అంటూ విమర్శించారు.

రాష్ట్రంలో రైతులు విత్తనాలు కోసం ఇబ్బందులు పడుతున్నారు అని, ఈ ప్రభుత్వం కనీసం సమయానికి విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ పథకానికి సుమారు రూ. 5,000 కోట్లు అవసరం ఉంటే, కేవలం రూ. 1,700 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇంకా ఈ పథకానికి ఏమి న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 80 లక్షల పైగా విద్యార్థులు ఉంటే, 40 లక్షలమందికే అమ్మఒడి పథకం వర్తింపుజేస్తున్నారని, మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటని, ఫిరీయింబర్సుమెంట్ లో కూడా కోత విధించారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణ రంగాలకు తక్కువ బడ్జెట్ కేటాయించి, న్యాయం చేయలేదని తెలిపారు.

 

[subscribe]
[youtube_video videoid=z78qrl1Ht00]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =