మరో లేఖ రాసిన హరిరామ జోగయ్య

Another Letter Was Written By Harirama Jogaiah, Another Letter Was Written, Harirama Jogaiah Written Letter, Harirama Jogaiah Another Letter, Harirama Jogaiah Letter, Chandrababu, Pawan Kalyan, Harirama Jogaiah, BJP, TDP, Janasena, YCP, Congress, Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Harirama Jogaiah Letter,Chandrababu, Pawan Kalyan,Harirama Jogaiah,BJP, TDP, JANASENA, YCP, CONGRESS,

పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషిగా లేఖలు రాస్తున్న మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య..జనసేన అధినేతకు మరో లేఖ రాసారు.  ఏపీలోని  ఎన్నికల సమయంలో వరుసగా లేఖలు విడుదల చేస్తూ వస్తున్న హరిరామ జోగయ్య..కొన్ని సందర్భాల్లో పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ .. మరోసారి ఆయనకు బాసటగా నిలుస్తూ ఉండటం తెలిసిన విషయమే. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులతో పాటు టీడీపీ,బీజేపీ,జనసేన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని కూడా ఆయన పిలుపు నిస్తున్నారు.

తాజాగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందా? అని ప్రశ్నిస్తూ చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖను విడుదల చేశారు. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో..వివిధ పార్టీలు తమ ప్రచారాలను హోరెత్తిస్తున్నాయన్న ఆయన.. కూటమి  ఏపీప్రజలకు ఇచ్చిన హామీలు హోరెత్తిస్తుంటే వైసీపీ హామీలు చతికిలబడ్డాయని హరిరామ జోగయ్య విమర్శించారు.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 100, జనసేన 16, భారతీయ జనతా పార్టీ 5 స్థానాలను నెగ్గించుకోవటం ఖాయంగా కనబడుతుందని హరిరామజోగయ్య జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలోను.. పవన్ కళ్యాణ్‌ రెండో స్థానంలోనూ అధికార హోదాలో ఉంటారని తన లేఖలో చెప్పారు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య.

కాగా  రెండు రోజుల క్రితం పవన్ కు లేఖ రాసిన హరిరామజోగయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు ఆయన పార్టీ కూడా కాపు కులానికి వ్యతిరేకం అంటూ తన లేఖలో వివరించారు. అందుకే ఈ ఎన్నికలలో వైఎస్ జగన్, వైసీపీ అభ్యర్థులను అంతా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అధికారం దక్కించడమే కాపు సంక్షేమ సేన ధ్యేయం అంటూ ఆయన  కోరారు.

పవన్ కళ్యాణ్ ఆధిపత్యంలో జనసేన, తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హరిరామజోగయ్య  కాపు బలిజ సంక్షేమ శాఖ సభ్యులు, కాపు కులస్థులకు పిలుపునిచ్చారు.    బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను కలుపుకొని కూటమి అభ్యర్థులతో పాటు మరీ ముఖ్యంగా జనసేన పార్టీకి నుంచి పోటీ చేస్తున్న 21 మంది అభ్యర్థుల విజయానికి  కృషి చేయాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + fifteen =