ముందే తేరుకున్న కొంతమంది వైసీపీ కాపు నేతలు

YCP Strategy Is Not Working On Pawan Kalyan, YCP Strategy, YCP Strategy On Pawan Kalyan, Strategy Working On Pawan Kalyan, YSRCP Kapu Leaders, Janasena, YCP, Congress,Pawan Kalyan, Kurasala Kannababu, Jakkampudi Raja, Alla Nani, Granthi Srinivas, Vanga Geetha, Perninani, Ambati Rambabu, Gudivada Amarnath, Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Ysrcp Kapu Leaders,BJP, TDP, JANASENA, YCP, CONGRESS,Pawan Kalyan, Kurasala Kannababu, Jakkampudi Raja, Alla Nani, Granthi Srinivas, Vanga Geetha, Perninani, Ambati Rambabu, Gudivada Amarnath

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వైసీపీలో.. కొంతమంది కాపు నేతలు  మాత్రం ఆచితూచి వ్యవహరించారు. వ్యక్తిగత విమర్శలు, దూషణలతో తమకే  నష్టం అని గ్రహించి ముందు నుంచీ పవన్ కళ్యాణ్‌కు దూరంగా ఉంటూనే వచ్చారు. పవన్‌‌ను విమర్శించే వ్యవహారంలో  నొప్పించకుండా తప్పించుకున్న నేతలలో.. కురసాల కన్నబాబు, జక్కంపూడి రాజా, ఆళ్ల నాని, గ్రంథి శ్రీనివాస్, వంగా గీత వంటి వారు ఉన్నారు. ఎప్పుడైనా విమర్శలు చేసినా కూడా పవన్ కళ్యాణ్‌‌ను కించపరిచే విధంగా  వ్యక్తిగత విమర్శలకు ఏ మాత్రం చోటివ్వలేదు.

కానీ పేర్నినాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌ వంటి వాళ్లు తాము పవన్ కళ్యాణ్‌ను తిడితేనే అధినాయకుడు జగన్ కరుణ ఉంటుందన్న లెక్కలు బాగా వేసుకున్నారు. దీంతో పవన్ కి నష్టం చేస్తున్నామన్న భ్రమలో పవన్ మీద వ్యక్తిగత విమర్శలకు దిగి వైసీపీకి  మొత్తంగా కాపులను దూరం చేశారనే వాదన వినిపిస్తోంది.అది ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.మొదట్లో వైఎస్సార్సీపీ అమలు చేసిన విచిత్రమైన స్ట్రాటజీతో టోటల్ కాపులే వైసీపీకి దూరం అయినట్లు చెబుతున్నారు.

ఎన్టీఆర్ ని దేవుడని పొగుడుతున్న అదే నోటితో వైసీపీ నేతలు చంద్రబాబును తిట్టడం, చిరంజీవిని గొప్పవాడంటూ పొగుడుతూనే  పవన్ కళ్యాణ్ ను తిట్టడం వల్ల కాపులలో చీలికను తీసుకువచ్చి తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ అధిష్టానం భావించింది. కానీ ఆ వ్యూహం కూడా ఫలించక పోగా  రివర్స్‌ గేర్ లో పనిచేసింది.  సాక్షాత్తూ జగన్మోహన రెడ్డే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల  గురించి తరచూ మాట్లాడడంతో.. కాపులే కాకుండా, ఇతర వర్గాల వారిలో కూడా పవన్ పట్ల సానుభూతి పెరిగింది.

పవన్  లేవనెత్తిన విధానపరమైన, పాలనా పరమైన ఏ ప్రశ్నకు కూడా జవాబివ్వని ఏపీ సీఎం జగన్ అన్నిటికీ నాలుగు పెళ్లిళ్లే సమాధానం అనేటట్లు మాట్లాడటం చాలామంది జీర్ణించుకోలేకపోయారు. కానీ జగన్ అండ్ కో మొదటి నుంచి చివర దాకా అదే మార్గాన్ని ఫాలో అయ్యారు. అయితే ఈ వ్యతిరేకత  ఏ స్థాయికి  వెళ్లిందంటే పవన్ కళ్యాణ్ ను బలంగా వ్యతిరేకిస్తూ.. జనసేన రాజకీయాలను బలంగా వ్యతిరేకించే కాపు నాయకుల కుటుంబాల్లో కూడా  పవన్ కళ్యాణ్‌కు  బహిరంగంగా మద్దతు తెచ్చే పరిస్థితికి వెళ్లింది.

ముద్రగడ విషయంలోనూ ఇదే జరిగింది. ముద్రగడ పద్మనాభం స్వలాభం చూసుకుని పవన్ కళ్యాణ్ పై వినిపిస్తున్న నిరసన గళానికి ఆయన కుటుంబంలోనే ఓ వ్యతిరేక గళంగా ముద్రగడ కూతురు బహిరంగంగా తండ్రిని విభేదించి.. పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చే వరకూ వచ్చింది.  వైసీపీ నేతల తీరుతో.. దశాబ్ద కాలంలో  కాపుల్లో ఐక్యత కావాలనే కోరిక, వాదన బలపడేలా చేశాయి. అంతేకాదు ప్రజారాజ్యం వైఫల్యం కూడా కాపులకు ఒక చేదు నిజంలా కనిపించి కాపుల్లో ఐక్యతను పెంచి వారిని వైసీపీకి దూరం చేసిందన్న ప్రచారం జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 1 =