రాయలసీమ ప్రజలకు క్షమాపణలు : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

Andhra Pradesh BJP president Somu Veerraju, AP BJP chief Somu Veerraju tenders apologises, AP BJP President Somu Veerraju, AP BJP President Somu Veerraju Says Apologies to Rayalaseema People, AP BJP President Somu Veerraju Says Apologies to Rayalaseema People Over His Comments, Apologies to Rayalaseema people Somu Veerraju, BJP President Somu Veerraju, Mango News, Somu in soup over district of murderers remark, Somu Veerraju Says Apologies to Rayalaseema People, Somu Veerraju Says Sorry To Kadapa People, YSRCP MLA Srikanth Reddy demands apology from Somu Veerraju

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు గురువారం విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రజలుకు ఆయన క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. “రాయలసీమ రతనాల సీమ ఈ పదం నాహృదయంలో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు విమర్శించే విషయంలో వాడిన పదాలు వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలు వాపసు తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులుకు తెలుసు, రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టులు విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని బీజేపీ ఆలోచన” అని సోమువీర్రాజు ప్రకటనలో పేర్కొన్నారు.

ముందుగా విశాఖలో సోము వీర్రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి జిల్లాకు ఓ ఎయిర్‌పోర్టు నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయంపై వ్యాఖ్యానించారు. “జిల్లాకో ఎయిర్‌పోర్టు ఎందుకు, రాయలసీమలో ఎయిర్‌పోర్టులు, కడపలో ఎయిర్‌పోర్టు, ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్టు, వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు” అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో సోము వీర్రాజు తన వ్యాఖ్యలపై స్పందిస్తూ వివరణ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − nine =