ఫిబ్రవరి 10న కళ్యాణ మస్తు, షాదీ తోఫా సాయం, లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్

CM YS Jagan to Release YSR Kalyanamasthu and Shaadi Tohfa Schemes Funds on 10th February,CM YS Jagan,YSR Kalyanamasthu,Shaadi Tohfa Schemes,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి (ఫిబ్రవరి 10, శుక్రవారం) వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల యొక్క లబ్ధిదారులు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. పేదింటి ఆడపిల్లల వివాహాల కోసం వారి కుటుంబాలకు బాసటగా ఉండేందుకు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా పథకాలను ఏపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ పథకాలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, 2022, సెప్టెంబర్ 30న కళ్యాణ మస్తు, షాదీ తోఫా పథకాల వెబ్‌సైట్‌ను సీఎం జగన్ ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో 2022, అక్టోబర్ 1 నుంచి 2022, డిసెంబర్ 31 మధ్య వివాహం చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యంగులు, ముస్లిం మైనారిటీల యువతులకు ఫిబ్రవరి 10న సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి ఆర్థిక సహాయాన్ని జమచేయనున్నారు. కాగా బాల్య వివాహాలను అరికట్టేందుకు, చదువును ప్రోత్సహించేందుకు ఈ పథకాల అమల్లో ప్రభుత్వం పదో తరగతి నిబంధనను చేర్చింది. వరుడుకి 21 ఏళ్లు, వధువుకు 18 ఏళ్లు వయస్సు నిండి ఉండడంతో పాటుగా వధూవరులు ఖచ్చితంగా పదో తరగతిలో పాస్ అయి ఉండాలనే నిబంధన పెట్టారు.

కళ్యాణ మస్తు, షాదీ తోఫా ఆర్ధిక సాయం వివరాలు:

  • కళ్యాణ మస్తు: ఎస్సీలకు – రూ. 1 లక్ష
  • కళ్యాణ మస్తు: ఎస్సీల కులాంతర వివాహాలకు – రూ.1.20 లక్షలు
  • కళ్యాణ మస్తు: ఎస్టీలకు – రూ.1 లక్ష
  • కళ్యాణ మస్తు: ఎస్టీల కులాంతర వివాహాలకు – రూ.1.20 లక్షలు
  • కళ్యాణ మస్తు: బీసీలకు – రూ.50 వేలు
  • కళ్యాణ మస్తు: బీసీల కులాంతర వివాహాలకు – రూ.75 వేలు
  • కళ్యాణ మస్తు: దివ్యాంగులు వివాహాలకు – రూ.1.5 లక్షలు
  • కళ్యాణ మస్తు: భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు – రూ.40 వేలు
  • షాదీ తోఫా: ముస్లిం మైనారిటీలకు – రూ.1 లక్ష.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + twenty =