తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం?

Educational Institutions In telangana, Mango News, School Reopening News, Schools and Educational Institutions, Schools and Educational Institutions in Telangana, Schools and Educational Institutions in Telangana Likely to Reopen from February 1, Schools to Reopen, telangana government, Telangana Govt Plans To Reopen Schools, telangana school reopening News, Telangana Schools Reopen, Telangana Schools to reopen

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు, ఇతర విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 24 నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌/డిస్టెన్స్ పాఠాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే విద్యార్థులకు భౌతికంగా పాఠశాలలు ప్రారంభించే అంశంపై ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కరోనా నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల ప్రారంభించనున్నట్టు సమాచారం. పాఠశాలల పున:ప్రారంభంపై నేడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశమునట్టు తెలుస్తుంది. కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టడం, వార్షిక పరీక్షలు దగ్గరపడుతుండడం, పలు రాష్ట్రాల్లో మళ్ళీ పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా పాఠశాలలు తెరిచేందుకే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =