నేడు, రేపు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్, పూర్తి షెడ్యూల్ ఇదే

AP CM Jagan Arrives For Two-Day Visit of YSR Kadapa District on Today and Tomorrow,CM YS Jagan Kadapa Tour,YS Jagan Two-Day Visit Kadapa Tour,YSR Kadapa District,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన నేడు, రేపు జిల్లాలో జరుగనున్న పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి జిల్లాలో ఉంటున్నందున అధికార యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దీనిపై ఇప్పటికే కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ అన్బురాజన్ కీలక సమీక్ష చేపట్టి, సీఎం జగన్ పర్యటన పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని క్రిందిస్థాయి సిబ్బందికి సూచనలిచ్చారు.

సీఎం జగన్ కడప జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే..

  • డిసెంబర్ 2న ఉదయం 10:20 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.
  • 11:15 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుని 11:30 వరకు స్థానిక నేతలతో మాట్లాడతారు.
  • అనంతరం ప్రత్యేక విమానంలో 11:50 గంటలకు లింగాల మండలం సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు.
  • మధ్యాహ్నం 12 గంటలకు రిజర్వాయర్ ప్రాంతంలో బోటింగ్ జెట్టీని ప్రారంభిస్తారు.
  • ఆ తర్వాత వైఎస్సార్ లేక్ వ్యూ చేరుకొని 12:40 గంటలకు వైఎస్సార్ రెస్టారెంట్ ను ప్రారంభిస్తారు.
  • ఇక కొద్దిసేపు విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:30 వరకు ప్రజనుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు.
  • అటుపై సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు.
  • స్థానిక నేతలతో కొద్దిసేపు చర్చించిన అనంతరం రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • ఇక డిసెంబర్ 3న ఉదయం 8:55 గంటలకు హెలికాఫ్టర్ లో పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
  • ఆ తర్వాత రోడ్డు మార్గాన కదిరి రోడ్డులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కు చేరుకుంటారు.
  • అక్కడ 9:30 వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు.
  • అనంతరం భాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని 9:45 గంటలకు హెలికాఫ్టర్ లో బయలుదేరి 10:10కి కడప విమానాశ్రయం చేరుకుంటారు.
  • 10:15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకొని 11:30 గంటలకు తిరిగి తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =