జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్.. అతిపెద్ద సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధమన్న ప్రధాని మోదీ

India Assumes G20 Presidency From Today PM Modi Urges Unity on Greatest Challenges,India Assumes G20 Presidency,G20 Presidency,PM Modi G20 Presidency,Mango News,Mango News Telugu,Prime Minister Narendra Modi, Narendra Modi News and Updates,PM Modi Latest News and Updates,PM Modi,Prime Minister Modi,Indian Prime Minister Modi Latest News and Updates, Gujarat Assembly Elections,Assembly Elections In Gujarat, Gujarat Assembly Poll,Gujarat Assembly News And Live Updates

జీ-20 కూటమి దేశాలకు భారతదేశం ఇకనుంచి అధ్యక్షత వహించనుంది. ఈ మేరకు భారత్ గురువారం జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను అధికారికంగా చేపట్టింది. ఈ సందర్భంగా, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా జీ-20 లోగోను కలిగి ఉన్న 100 స్మారక చిహ్నాలు డిసెంబర్ 1 నుండి 7 వరకు ఏడు రోజుల పాటు శ్రీనగర్‌లోని శంకరాచార్య ఆలయం నుండి ఢిల్లీలోని ఎర్రకోట మరియు తంజావూరులోని గ్రేట్ లివింగ్ చోళ దేవాలయం వద్ద ప్రదర్శితమవుతాయి. అలాగే ఇది కాకుండా, ఢిల్లీలోని హుమాయున్ సమాధి, పురానా క్విలా, గుజరాత్‌లోని మోధేరా సూర్య దేవాలయం, ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం మరియు బీహార్‌లోని షేర్ షా సూరి సమాధి వంటివి ఈ 100 ప్రదేశాల జాబితాలో ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది ఇండియాలో జరుగనున్న సమ్మిట్ లో, సుస్థిర పర్యావరణ అభివృద్ధికి సరసమైన సాంకేతికతను అందించడం, దేశం యొక్క డిజిటల్ పరివర్తనను హైలైట్ చేయడం వంటివి భారతదేశం యొక్క లక్ష్యాలుగా ఉన్నాయి.

ఇక ఇటీవలే బాలి వేదికగా జరిగిన రెండు రోజుల కూటమి నేతల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా చివరి రోజు ఇండోనేషియా నుండి అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు లభించాయి. సభ్యదేశాల ప్రతినిధుల కరతాళ ధ్వనుల మధ్య ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో జీ-20 అధ్యక్ష బాధ్యతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి నుంచి భారత్ అధ్యక్ష బాధ్యతలు అందుకున్న దరిమిలా ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఒక సందేశాన్నిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా.. ‘భారతదేశం యొక్క జీ-20 ప్రెసిడెన్సీ మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూర్చే దిశగా పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. అలాగే ఈ అతిపెద్ద సవాల్‌ను స్వీకరించేందుకు భారత్ సిద్ధమని కూడా స్పష్టం చేశారు. అయితే దీనికోసం ప్రజలు దేశానికీ మద్దతుగా నిలవాలని, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కాగా జీ-20 కూటమి అనేది, ప్రపంచంలోని అతిపెద్ద అధునాతన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లోని 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్‌తో కూడిన ఒక ప్రీమియర్ ఫోరమ్. జీ-20 ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌లకు ప్రపంచ ఆర్థిక మరియు ఆర్థిక సమస్యలపై చర్చించడానికి వేదికగా 1999లో స్థాపించబడింది. గ్రూప్ ఆఫ్ ట్వంటీలో 19 దేశాలు.. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్ ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 19 =