క్రికెట్ అడ్వైజరీ కమిటీని నియమించినట్టు ప్రకటించిన బీసీసీఐ, సభ్యులు ఎవరంటే?

BCCI Announces Appointment of Three-member Cricket Advisory Committee,BCCI Announced Cricket Advisory Committee,Appointment Of Cricket Advisory Committee,Cricket Advisory Committee,Mango News,Mango News Telugu,3 Member Cricket Advisory Committee,BCCI Advisory Committee,Advisory Committee BCCI,BCCI,BCCI Latest News and Updates,BCCI Latest News and Live Updates,The Board of Control for Cricket in India

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) డిసెంబర్ 1, గురువారం తన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ని నియమించినట్లు ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీలో అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్ ఉన్నారు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ఒక ప్రకటన చేశారు. గతంలో ఉన్న బీసీసీఐ సీఏసీలో మదన్ లాల్, రుద్ర ప్రతాప్ సింగ్ (ఆర్పీ సింగ్), ఎంఎస్ సులక్షణ నాయక్‌ లు ఉండగా, మదన్ లాల్, ఆర్పీ సింగ్ స్థానంలో అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేను ఎంపిక చేసి, ఎంఎస్ సులక్షణ నాయక్‌ ను కొనసాగిస్తూ కొత్త కమిటీని ప్రకటించారు. జాతీయ జట్టును ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ సభ్యులను ఈ కమిటీ ఎంపిక చేయనుంది.

ఎంపికైన ముగ్గురు సభ్యులు కూడా గతంలో భారత్ జట్టుకు సేవలందించారు. అశోక్ మల్హోత్రా 7 టెస్టులు మరియు 20 వన్డే ఇంటర్నేషనల్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు మరియు ఇటీవలే ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. పరాంజపే దేశం తరపున 4 వన్డేలు ఆడాడు మరియు సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో భాగంగా ఉన్నాడు. ఇక 11 ఏళ్ల కెరీర్‌లో భారత్ తరఫున రెండు టెస్టులు, 46 వన్డేలు మరియు 31 టీ20లు ఆడిన సులక్షణ నాయక్, ముగ్గురు సభ్యుల సీఏసీలో భాగంగా కొనసాగుతున్నారు.

ఇటీవలే చేతన్‌ శర్మ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన సెలక్షన్‌ కమిటీకి మొత్తానికి బీసీసీఐ ఒకేసారి ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. వారి స్థానాలను భర్తీచేసేందుకు వెంటనే జాతీయ సెలక్టర్స్ (సీనియర్ మెన్) పోస్టుల భర్తీకి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది, అర్హులైన వారి నుంచి నవంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు బీసీసీఐ దరఖాస్తులను స్వీకరించింది. ఈ క్రమంలోనే కొత్త సీఏసీ దరఖాస్తులను పరిశీలించి, చీఫ్ సెలెక్టర్ తో పాటుగా మిగతా నలుగురు సెలక్షన్ కమిటీ సభ్యులను కూడా ఎంపిక చేయనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =