వచ్చే ఏడాది చివరినాటికి రాష్ట్రంలో సమగ్ర సర్వే పూర్తి, సరిహద్దు రాళ్లు పాతి రైతులకు భూ హక్కు పత్రాలిస్తాం – సీఎం జగన్

Ap Cm Jagan Launches 2Nd Phase Of Saswata Bhu Hakku Bhu Raksha Scheme In Srikakulam Today,By Next Year Survey Will Completed, Will Issue Land Right Documents, Farmers With Boundary Stones,Cm Jagan,Mango News,Mango News Telugu, Ys Jagan Mohan Reddy,Saswata Bhu Hakku,Bhu Raksha Land,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy, Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది చివరినాటికి సమగ్ర భూ సర్వే పూర్తి అవుతుందని, దాని ప్రకారం సరిహద్దు రాళ్లు పాతి రైతులకు హక్కు పత్రాలిస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం కింద లబ్దిదారులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై సీఎం జగన్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల తర్వాత తొలిసారిగా సమగ్రంగా భూముల రీ సర్వే చేపట్టామని, తద్వారా తప్పుడు తడకలుగా ఉన్న రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా ప్రతి కమతానికి ప్రత్యేక నెంబర్ కేటాయిస్తామని, దీంతో రైతులందరికీ వివాదాలు లేని భూమి అందిస్తామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం 2వేల రెవెన్యూ గ్రామాల్లో రికార్డులు ప్రక్షాళన చేశామని, అలాగే ఇప్పటివరకూ 7,92,238 మంది రైతులకు భూ హక్కు పత్రాలు అందజేశామని సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 4వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని, మే నాటికి 6వేల గ్రామాల్లో, అలాగే ఆగస్టు నాటికి 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి కానుందని వెల్లడించారు. ఇదేక్రమంలో వచ్చే ఏడాది చివరినాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తి చేసి రైతులకు పట్టాలు అందజేస్తామని వివరించారు. ఇక ఈ సర్వే కోసం అత్యున్నత సాంకేంతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, వేలమంది సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. ఏపీలో సివిల్ వివాదాలు లేని భూములను లాడ్బిడారులకు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని సీఎం జగన్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, అధికారులు ఇంకా సర్వేయర్లు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − one =