మరోసారి జగన్‌ 9 సెంటిమెంట్‌..! వర్కవుట్‌ అవుతుందా?

AP CM Jagan Sentiments Will Work On Elections To Win, AP CM Jagan Sentiments, Jagan Sentiments Will Work On Elections To Win, Jagan Sentiments for Elections, AP Assembly Elections, CM Jagan, Sentiments, Will CM Jagan Sentiments Will Work?,YSRCP, Elections Sentiments, Assembly Elections, Lok Sabha Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
AP Assembly Elections , CM Jagan, sentiments, will CM Jagan Sentiments will work?,YSRCP

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో చర్చనీయాంశం అవుతోంది. గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రూపొందించిన వైసీపీ.. ఈసారి కూడా తొమ్మిది అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈక్రమంలోనే నవరత్నాలు 2.0 అన్న పేరు ప్రచారం జరుగుతోంది. మేనిఫెస్టో విడదల సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామన్నారు. అందుకే కాలర్‌ ఎగరవేసుకుని మరీ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఇతర పార్టీల్లాగా అలవికాని హామీలు, ఆచరణ సాధ్యం కాని పథకాలకు తమ మేనిఫెస్టోలో చోటు లేదన్నారు ఉన్న పథకాలకు కొనసాగిస్తూ, ఇచ్చే నిధులను పెంచుతూ, సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసేలా మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు వెల్లడించారు.

ఈ మేనిఫెస్టోలో 9 అంశాలు ఇలా ఉన్నాయి. 1. విద్య 2. వైద్యం 3. వ్యవసాయం 4. ఉన్నత విద్య 5. నాడు – నేడు 6. పేదలందరికీ ఇళ్లు 7. మహిళా సాధికారిత 8. సామాజిక భద్రత 9. అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. గత ఎన్నికల్లో కూడా జగన్‌ 9 అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, వైఎస్‌ఆర్‌ జల కల, మద్య నిషేధం, జగనన్న అమ్మఒడి, వైఎస్‌ఆర్‌ ఆసరా, వైఎస్‌ఆర్‌ చేయూత, పేదలకు ఇళ్లు ఎన్నికలకు వెళ్లారు. బ్రహ్మాండమైన సీట్లతో విజయం సాధించారు. ఈక్రమంలోనే ఈ ఎన్నికల్లో కూడా జగన్‌ 9 అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. 9 సెంటిమెంట్‌ ను రిపీట్‌ చేసినట్లు తెలుస్తోంది.

నవరత్నాలను ప్రకటించి గతంలో ఎన్నికలకు వెళ్లిన జగన్‌ 175 సీట్లకు 151 సాధించి రికార్డుస్థాయిలో విజయాన్ని అందుకున్నారు. గత మేనిఫెస్టోలోని అంశాల్లో మెజారిటీ అమలు చేశారన్న పేరు పొందారు. ఇప్పుడు 9 అంశాలతో జనాల్లోకి వెళ్లిన జగన్‌ ఈసారి ఎలాంటి విజయం సాధిస్తారనేది ఆసక్తిగా మారింది. మేనిఫెస్టో విడుదల అనంతరం జగన్‌ విజయ భేరి పేరుతో మలివిడదల ప్రచారానికి శ్రీకారం చుట్టిన వైసీపీ అధినేత.. మేనిఫెస్టోను బైబిలు, ఖురాను, భగవద్గీతగా భావించి 99 శాతం అమలుచేసినట్లు ప్రకటించారు. అందుకే సగర్వంగా మీ బిడ్డ మీ ముందుకు వచ్చి నిలబడ్డాడని ప్రచారం చేస్తున్నారు. మరి ఈఎన్నికల్లో జగన్‌ను ఎంత వరకు ఏపీవాసులు ఆదరిస్తారో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 1 =