100 ఏళ్ళ తర్వాత మహాయజ్ఞంలా భూసర్వే చేస్తున్నాం, రైతులందరికీ వివాదాలు లేని భూమి అందిస్తాం – సీఎం జగన్

AP CM YS Jagan Distributes Clearance Documents to Farmers Regarding Denotify Lands at Avanigadda Today, AP CM YS Jagan Distributes Clearance Documents, Farmers Regarding Denotify Lands, CM YS Jagan will Visit Avanigadda, AP CM YS Jagan To Visit Avanigadda Tomorrow, AP CM YS Jagan Avanigadda Visit, Mango News, Mango News Telugu, Ys Jagan To Visit Avanigadda Tomorrow, Complete E-crop Validation In 3 Days, Complete E-crop Validation, Avanigadda E-crop Validation, CM Tour Of Avanigadda Postponed, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Latest News And Updates, Avanigadda AP CM Tour

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 100 ఏళ్ళ తర్వాత మహాయజ్ఞంలా భూసర్వే చేస్తున్నామని, రైతులందరికీ ఎలాంటి వివాదాలు లేని భూమి అందిస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. గురువారం ఆయన ఎన్టీఆర్‌ జిల్లా అవనిగడ్డలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సెక్షన్‌-22 ఏ (1) కేటగిరీ కిందకు వచ్చే నిషేధిత భూముల జాబితా నుండి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.

సీఎం జగన్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..

  • నేటి నుంచి అవనిగడ్డలో 10వేల పైచిలుకు ఉన్న రైతులకు సంబంధించి 15వేలకు పైగా ఉన్న భూములకు సర్వహక్కులు కల్పిస్తున్నాం.
  • ఇకపై వారు కానీ, వారి పిల్లలు కానీ, మనుమలు కానీ ఈ భూములపై హక్కు ఉంటుంది. ఈరోజునుంచి ఈ భూములకు సంబంధించి కొనుగోలు లేదా అమ్మకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.
  • దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో నేటికీ భూములకు సంబంధించి పక్కా రికార్డులు లేకపోవడం బాధాకరం.
  • రికార్డుల్లో వివరాలు పక్కాగా లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • అందుకే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముందుగా దీనిపై దృష్టి పెట్టాం.
  • భూముల రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేపట్టాం.
  • అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, 15వేల మంది సిబ్బందితో దీనిని నిర్వహిస్తున్నాం.
  • ఈ సర్వే కోసం విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నాం.
  • నవంబర్ నెల నుంచి ఏకంగా 1500 వందల గ్రామాల్లో మొదలు పెడుతున్నాం. వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం 15వేల గ్రామాల్లో పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించాం.
  • చుక్కల భూములు, అనాధీన భూముల విషయంలో ఉన్న అన్ని వివాదాలు పరిష్కరిస్తాం.
  • త్వరలోనే అన్ని గ్రామ సచివాలయాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
  • అలాగే త్వరలోనే ఏపీలోని రైతులందరికీ వివాదాలు లేని భూముల హక్కు పత్రాలు అప్పగిస్తాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 11 =